Actor Nikhil Tweet On Indian FootBall Team: ఇండియన్ ఫుట్ బాల్ టీంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ(Actor Nikhil )ఓ సంచలన ట్వీట్ చేశారు. ఆటలలో ఫుట్‌బాల్ అంటే నిఖిల్‌కు ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లను తరచూ ఫాలో అవుతుంటారు. అయితే సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్(fifaworld cup qualifiers)లో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్(Indian FootBall Team) ప్రదర్శన పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. గతేడాది నవంబర్ నుంచి మన జట్టు ఒక్క గోల్ కూడా కొట్టకపోవడం ఏం బాలేదన్నారు.
‘‘ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో మన జట్టు ప్రదర్శన నిరాశకు గురి చేసింది. ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అత్యధిక జనాభా ఉన్న దేశంగా మరెంతో సాధించాలి. ప్రపంచంలోనే అత్యంత పేరు, జనాభా ఉన్న దేశం మనది. మనకు గెలిచే అర్హత ఉంది. మన టీం ఇంతకంటే గొప్ప ప్రదర్శణ ఇవ్వాల్సి ఉండేది. దయచేసి మన ఇండియాలోని టీంను ప్రక్షాళన చేయండి. మన జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో గతేడాది జరిగిన ఖతార్ మ్యాచ్ తెలియజేస్తుంది. నవంబర్ నుంచి మన జట్టు ఒక్క గోల్ కూడా చేయకపోవడం బాధాకరం. సంక్షుభిత దేశమైన అఫ్గానిస్థాన్ జట్టునూ ఓడించలేకపోయాం. టీమ్‌ను పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అంటూ పోస్ట్ పెట్టాడు. దానికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ట్యాగ్ చేశారు. దీంతో ప్రస్తుతం నిఖిల్ చేసిన ట్వీట్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్ట్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు ఖతార్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖతార్ వేదికగా ఇండియన్ ఫుట్ బాల్ టీం ఇచ్చిన ప్రదర్శన దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను నిరాశపర్చింది. గురువారం అర్థరాత్రి జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ తలపడింది. ఈ ఆటలో ఒక్క గోల్ కూడా నమోదు చేయకుండా డ్రా అయ్యింది.
అసలు ఫూట్ బాల్ అంటే గుర్తు వచ్చేది అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ. ఇప్పటికీ వరకు అతనిని మించినవారే లేరు. కొద్ది నెలల క్రితమే మెస్సీ నార్వే స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland)ను వెనక్కి నెట్టి.... ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ (The Best FIFA Men's Player award 2023) అవార్డును సొంతం చేసుకున్నాడు. మెస్సీ ఈ అవార్డును గెలుచుకోవడం గత నాలుగేళ్లలో మూడోసారి. గతేడాది టైమ్ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యాడు. మెస్సీ ఈ ఏడాది జులైలో మియామి క్లబ్‌లో చేరాడు. మొత్తం 14 గేమ్స్ ఆడి 11 గోల్స్ కొట్టి జట్టును తొలిసారి లీగ్ విజేతగా నిలిపాడు. మెస్సీ వచ్చాక టోర్నీ వీక్షకుల సంఖ్య పెరిగిందని టైమ్ ఈ సందర్భంగా పేర్కొంది. అతడు ఇంటర్ మియామి జట్టుకు సంతకం చేసి అమెరికాను ఏకంగా సాకర్ దేశంగా మార్చేశాడంది.