Varalakshmi Vratham Pooja : హిందూ మతంలో ప్రతి రోజునీ ఒక్కో దేవుడికి అంకితం చేశారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజించి ఉపవాసం ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతామని విశ్వాసం. అయితే ప్రతిశుక్రవారం విశేషమైనదే కానీ..శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం మరింత విశిష్టమైనది.
పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. వివాహితులు శ్రావణ శుక్రవారం పూజ ఆచరిస్తారు. అత్యంత పవిత్రమైన ఈ రోజున వివాహితులతో పాటూ పెళ్లికానివారు కూడా అమ్మవారి పూజచేయొచ్చా? చేస్తే ఏమవుతుంది? శుక్రవారం రోజు ఇంకా ఏం చేస్తే లక్ష్మీకటాక్షం లభిస్తుంది. గోమాతకు సేవ చేయండి
శ్రీమహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గోమాతకు సేవచేయండి. శుక్రవారం రోజు ఆవులకు గ్రాసం వేయండి. గోపూజ చేసిన తర్వాత మీ స్తోమతకు తగ్గట్టుగా వస్త్రాలు , ఆహారాన్ని పేదలకు దానం చేయాలి.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయపడేందుకు
ఆర్థిక ఇబ్బందులు లేని వ్యక్తి ఉండరేమో..ప్రతి ఒక్కరికీ ఏదో సందర్భంలో ఆర్థిక ఇబ్బందులుంటాయి. వాటినుంచి బయటపడి లక్ష్మీ కటాక్షం పొందేందుకు శుక్రవారం అమ్మవారి పూజ తప్పనిసరి. ఈ రోజు వేకువజామునే స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో పూజచేయాలి. లక్ష్మీ అష్టోత్తరం, కనకధారాస్తోత్రం పఠించాలి
కోరికలు నెరవేరాలంటే ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, స్నానమాచరించి శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. శివలింగానికి కొబ్బరికాయను సమర్పించి చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించండి. శివుడు తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తాడు. అనంతరం ఇంట్లో ఉండే పూజా మందిరంలో లక్ష్మీపూజచేయండి. శుక్రవారం మరింత ప్రత్యేకం
మంచి జీవిత భాగస్వామిని పొందేందుకు
మంచి జీవిత భాగస్వామిని పొందాలనున్నా...పెళ్లైనవారి జీవితంలో మాధుర్యం ఉండాలన్నా శ్రావణశుక్రవారం పూజ అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు పండితులు. ఈ రోజు లక్ష్మీపూజతో పాటూ 21 సార్లు "ఓం స్రం శ్రీం శ్రౌం సః కేతవే నమః" అనే కేతువు మంత్రాన్ని జపించాలి.
శుక్రవారం లక్ష్మీపూజ చేస్తే ప్రయోజనాలివే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది..ఐశ్వర్యం లభిస్తుంది
పెళ్లికానివారు శుక్రవారం , శ్రావణ శుక్రవారం పూజ చేయొచ్చా అనే సందేహం ఉంది కొందరిలో..అయితే పెళ్లికానివారు కూడా శుక్రవారం రోజు లక్ష్మీపూజ చేయొచ్చు, శుక్రవారం పూజచేస్తే ఉత్తమ భర్త లభిస్తాడని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు వివాహితులు లక్ష్మీపూజ చేస్తే జీవితంలో సంతోషం పెరుగుతుంది, ఉపాధితో పాటూ అన్ని రంగాల్లో ఉండేవారు ఆర్థిక వృద్ధి సాధిస్తారు
సంతానానికి సంబంధించిన సమస్యలున్నవారు కూడా శుక్రవారం పూజ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
వరలక్ష్మీ వ్రతం 2025 తేదీ , సమయం, శుభ ముహూర్తం, పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక:ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.