Significance of Bell in Temple :  దేవాలయంలో గంటలు ఎందుకు మోగిస్తారు? కారణం మీకు తెలుసా? గంట ఎప్పుడు కొట్టాలి? అసలెందుకు ఆలయంలో అయినా, ఇంట్లో అయినా పూజ చేసేటప్పుడు గంట కొడతారు? అదే పనిగా మోగించేయకుండా ఓ నిర్దిష్ట సమయంలోనే గంట మోగస్తారు? దీనివెనుకున్న ఆధ్యాత్మిక కారణాలు, శాస్త్రీయ కారణాలు మీకు తెలుసా? పూజ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకూ సంపూర్ణ విధిలో గంటకు ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఈ యుగంలోనే కాదు గడిచిన యుగాల్లోనూ గంటకు ప్రాముఖ్యత ఉంది. స్కాంద పురాణం , అగ్ని పురాణం ,  తంత్ర గ్రంథాల్లో పూజలో గంట ప్రాముఖ్యత గురించి ఉంది. అందుకే పూజ సంబంధిత వస్తువులో గంటను తప్పని సరిగా ఉంచుతారు. ఈ శబ్ధం ప్రతికూల శక్తులను తొలగిస్తుందని భావిస్తారు.   హిందూ ధర్మ గ్రంథాల్లో  'నాద బ్రహ్మ' భావనలో ధ్వనిని బ్రహ్మ రూపంగా భావిస్తారు. గంట శబ్దం పూజ ప్రారంభానికి సంకేతం ఇస్తుంది..పూజపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత కుర్చుకునేందుకు సహాయపడుతుంది ఆధునిక పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే? ధ్వని తరంగాలు, కంపనాలకు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పండితుల అభిప్రాయం ప్రకారం గంట శబ్దం వల్ల ఏర్పడే ధ్వని తరంగాలు వాతావరణాన్ని పవిత్రం చేస్తాయి. ఓ నివేదిక ప్రకారం ఇవి 3-7 హెర్ట్జ్ ఆల్ఫా తరంగాలను ఉత్పత్తి చేస్తాయి, ఇవి మెదడును శాంతింపజేయడంలో సహాయపడతాయి.  

ధ్యానం , మెడిటేషన్‌కు ముందు గంట శబ్దం మెదడును 'ఫోకస్' మోడ్‌లోకి తీసుకువస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది , పూజపై మనసుని లగ్నం చేస్తుందని నమ్ముతారు.

గంట శబ్దం మరియు చైతన్యానికి సంబంధం ఏంటి?

అంతర్గత శక్తి   జాగరణ జరిగినప్పుడే వ్యక్తి తనను తాను తెలుసుకునే దిశగా అడుగులు వేస్తాడని నమ్ముతారు. తనకి తన ఉనికి గురించి అవగాహన కల్పిస్తుంది గంట శబ్దం. అందుకే తాంత్రిక సాధనలో గంటను 'చైతన్యం మేల్కొల్పే' యంత్రంగా భావిస్తారు. ఇది మీ 'అంతర్గత చైతన్యం'ను బ్రహ్మతో కలిపే సాధనం అని నమ్ముతారు. 

గంట శబ్దం శరీరంలోని ఏడు చక్రాలపై కంపన ప్రభావాన్ని చూపుతుంది, దీనివల్ల సమతుల్యత ఏర్పడుతుంది. ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్‌లను చెక్కుచెదరకుండా ఉంచుతుంది. శరీరంలోని సప్తచక్రాలు చైతన్యవంతం అవడంతో పెరిగిన ఆరాధనా శక్తి వల్ల భక్తి మనసులోనే నిలిచి ఉంటుంది.

గంటను ఎప్పుడు మోగించాలి?

ఇంతకీ గంటను ఎప్పుడు మోగించాలంటే..ఆలయంలోకి ప్రవేశించగానే గంటను మోగిస్తే శరీరం, మనసు స్వచ్ఛమవుతుంది. మనసు భగవంతుడిపై నిలుస్తుంది. గుడి నుంచి బయలుదేరేముందు గంట మోగిస్తే మీ సందేశం నేరుగా భగవంతుడిని చేరుతుంది. ఫలితంగా మీ కోర్కెలు త్వరగా నెరవేరుతాయట. ఇక పూజ సమయంలో అంటే..పూజ పూర్తైన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు గంట మోగిస్తారు. ఇంట్లో పూజల సమయంలోనూ పూజ ప్రారంభానికి ముందు భగవంతుడిని ఆహ్వానిస్తూ గంట మోగిస్తారు. పూజ అనంతరం  హారతి ఇచ్చే సమయంలో గంట మోగిస్తారు.   

పూజలో గంట మోగించడం అంటే కేవలం ధార్మిక సంప్రదాయం మాత్రమే అని భావించవద్దు..పూజలో భాగంగా గంటను మోగించినప్పుడు ఆ శబ్ధాన్ని ప్రశాంతంగా స్వీకరించండి..ఈ పవిత్రధ్వని మీకు ఎంత ప్రశాంతత ఇస్తుందో అర్థమవుతుంది.

గమనిక: ఆధ్యాత్మిక గ్రంధాల్లో అందించిన సమాచారం ఆధారంగా మీకు అందించిన కథనం ఇది. ఇది కేవలం ప్రాధమిక సమాచారం. మాత్రమే. అనుసరించేముందు మీకు నమ్మకమైన ఆధ్యాత్మిక వేత్తల సలహాలు అడిగి తెలుసుకోండి..

పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!

అంతర్వాహిని సరస్వతి నది ఎక్కడ పుట్టింది.. పుష్కర స్నానాలు ఎక్కడచేయాలి..ఘాట్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి