పూర్తి విశ్వంతో పాటు మన రాశిచక్రం ప్రభావం మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. హిందుత్వ సంస్కృతి ఈ విశ్వానికి మానవ జీవితానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ఎన్నో వివరాలను అందించింది. అందులో ఒకటి జ్యోతిష్యం కూడా. ప్రతీ జాతకుడికి ఒక ప్రత్యేక దైవశక్తి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది. మరి ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలమో తెలుసుకుంటే జీవిత పరమార్థాన్ని త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది.


మేషరాశి


రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశి. వీరికి ధైర్య సహాసాలు ఎక్కువ. హనుమంతుడు వీరికి ఉత్తమ దైవంగా చెప్పవచ్చు. హనుమంతుడి అంకిత భావం వీరి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి వీరిని కాపాడతాడు.


వృషభ రాశి


వృషభరాశిలో జన్మించిన వారు సెన్సిబుల్ గా ఉంటారు. వినయవిధేయతలు కలిగిన వారు. సౌందర్యఆరాధకులు కూడా. సంపదకు, సమృద్ధికి ప్రతీక అయిన లక్ష్మీదేవి వీరికి అనువైన దైవశక్తి. లక్ష్మీ ఆరాధన వీరికి ఆర్థిక పరిపుష్టిని, మానసిక తృప్తిని ఇస్తుంది.


మిథున రాశి


మిథున రాశి వారు కృష్ణుడిని ఆరాధిస్తే త్వరగా జీవిత లక్ష్యాలు పూర్తి చెయ్యగలుగుతారు. కృష్ణ తత్వం వీరికి సరైన మార్గదర్శనం చెయ్యగలుగుతుంది. కనుక కృష్ణుని ఆరాధించడం, ఆయన బోధలు పాటించడం వీరికి సన్మార్గంగా చెప్పవచ్చు.


కర్కాటక రాశి


కర్కాటక రాశి వారు చాలా కేరింగ్ పర్సనాలిటి కలిగి ఉంటారు. మాతృత్వ భావనకు ప్రతీక పార్వతి వీరికి సరైన దైవశక్తి. ఆమె ప్రేమకి, కేరింగ్ కి ప్రతీక.


సింహ రాశి


సకల లోకాలను పాలించే విష్ణుమూర్తి సింహరాశి వారి దైవం. సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. విష్ణుమూర్తి ఈ విశ్వాన్ని రక్షిస్తాడు. సింహరాశి వారు కూడా వారిని నమ్ముకున్న వారి పట్ల అటువంటి బాధ్యతతో ఉంటారు కనుక విష్ణువు ఆరాధన వీరిని మరింత బలంగా తయారు చేస్తుంది.


కన్యారాశి


కన్యారాశి వారు సూక్ష్మబుద్ధి కలిగిన వారు, పర్ఫెక్షనిస్టులు కూడా. వీరికి సరస్వతి ఆరాధన బాగా మేలు చేస్తుంది. వీరిలోని సుగుణాలను మరింత మెరుగు పడేందుకు తోడ్పాటునందిస్తుంది. కళల్లో, ఇతర శాస్త్రపరిజ్ఞాన సముపార్జనకు లక్ష్మీ ఆరాధన చాలా తోడ్పాటును అందిస్తుంది.


తులా రాశి


తులా రాశి వారు ప్రతి విషయంలో సంతులనంగా ఉండే లక్షణం కలిగి ఉంటారు. వీరి దైవం గణపతి. ఆయన విజ్ఞాలను తొలగించి మార్గాన్ని సుగమం చెయ్యగలడు.


వృశ్చిక రాశి


వృశ్చికరాశి వారు కాళీమాత ఆరాధన చేసుకుంటే వీరికి ఆత్మ జ్ఞానం త్వరగా అందుతుంది. ఆహంకారం నశించి మోక్షం ప్రాప్తిస్తుంది.


ధనస్సురాశి


వైద్యానికి, శుశ్రూతకు ప్రతీక అయిన ధన్వంతరిని ఆరాధిస్తే ధనస్సు రాశిలో పుట్టిన వారికి మేలు జరుగుతుంది. వీరు సత్యశోధనలో ముందుంటారు. కనుక వీరికి త్వరగా సత్యం బోధపడాలంటే ధన్వంతరి ఆరాధన మంచిది. ఈ దైవారాధన వీరికి ఆధ్యాత్మిక, ప్రాపంచిక విషయాల్లో సైతం విజయం చేకూరుస్తుంది.


మకరరాశి


మకరరాశి వారికి నిజాయితి, అంకితభావం చాలా ఎక్కువ. వీరిని నడిపించే దైవం శని. శని క్రమశిక్షణకు, కర్మ కారకుడు కూడా. విజయం కోసం వీరు చేసే కఠోరశ్రమకు మంచి ఫలితాలను శని వీరికి అందించగలడు.


కుంభరాశి


దృక్పథం, పరోపకారం కలిగిన కుంభరాశి వారు రాముడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాముడి అంకితభావం, స్థిరమైన నిజాయితి కుంభరాశి వారి సంఘ సంస్కరణకు ఎంతో ఉపయోగపడతాయి.


మీనరాశి


సహానుభూతి కలిగి గొప్ప కలలు కనే సామర్థ్యం కలిగిన మీన రాశి వారు శివారాధన చేస్తే వీరిలోని సృజనాత్మకత, సున్నితత్వం వీరికి మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తుంది.


Also Read : కన్ను అదరడం.. అద్దం పగలడం.. ఇవి నిజంగా మూఢనమ్మకాలేనా? వీటి వెనుక ఉన్న లాజిక్ ఏమిటీ?













Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.