ల్లిదండ్రులు, సోదరీసోదరులను దేవుడే నిర్ణయించి మనకు అందించే అనుబంధాలు. కానీ.. మిత్రులను మనమే ఎంచుకుని స్నేహం చేస్తాం. అనుబంధాన్ని పెంచుకుంటాం. కొన్నిసార్లు బంధువులను మించిన అనుబంధం కొంత మంది స్నేహితులతో ఏర్పడుతుంది. నిజంగా కష్టకాలంలో తోడు నిలిచే స్నేహితుడు దొరకడం అదృష్టమే. అలాంటి మిత్రుడు కలలో కనిపిస్తే జీవితంలో పెనుమార్పులు జరుగుతాయట.


కలలో బెస్ట్ ఫ్రెండ్ కనిపిస్తే?


కలలో మీ బెస్ట్ ప్రెండ్ కనిపిస్తే అది చాలా శుభప్రదమైన కలగా పరిగణించాలట. ఈ కల తర్వాత మీకు మరింత మంది మంచి వారితో పరిచయాలు పెరగవచ్చు. ఈ కల తర్వాత మీ జీవిత గతి మారవచ్చు. మీరు విజయాల బాట సాగుతారనేందుకు ఈ కల సూచనగా చెప్పవచ్చు. కఠిన పరిస్థితుల్లో స్నేహితుడు తోడున్నాడని అనేందుకు సంకేతంగా కూడా భావించవచ్చు.


బాల్య మిత్రుడు కనిపిస్తే?


బాల్యం ఎవరికైనా మధుర స్మృతి. బాల్య మిత్రులు ఎప్పటికీ ప్రియమైన వారిగానే అనిపిస్తారు. అలాంటి చిన్ననాటి స్నేహితుడు కలలో కనిపిస్తే జీవితంలో జరగబోయే మంచి మార్పులకు సంకేతం. ఇక రాబోయే జీవిత కాలం స్వర్ణయుగం వంటిదని చెప్పవచ్చు.


మాట్లాడుతుంటే?


కలలో మీ చిరకాల మిత్రుడితో కలిసి మనసు విప్పి మాట్లాడుతున్నట్టయితే ఏదో రహస్యం మీరు మనసులో దాచుకున్నారని అర్థం. ఇలాంటి కల వస్తే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీకు తెలియకుండానే రహస్యాలు బయటపెట్టేసే ప్రమాదం ఉంటుంది. మనసులో భారంగా మోస్తున్న విషయాలు ఏవైనా ఉంటే మీ సన్నిహితులతో పంచుకొని మనసు తేలిక చేసుకోవడం అవసరం. అంతే కాదు ఈ కల.. మీ స్నేహితులు మీకు సహాయం చెయ్యగలరు అని చెప్పే సూచన కూడా కావచ్చు.


మిత్రుడి మరణం?


మిత్రుడు మరణించినట్లు కల వస్తే మీరు జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోబోతున్నారని తెలుపుతుంది. మీకు అనారోగ్యం కలుగవచ్చు. ఇలాంటి కల వచ్చినప్పుడు మానసిక శారీరక ఆరోగ్యాల మీద శ్రద్ధ పెట్టాలి.


గొడవ జరిగితే? 


మిత్రుడితో గొడవ పడినట్టు కలవస్తే మీ సోషల్ లైఫ్ ఏదో ప్రమాదంలో పడబోతోందని చెప్పేందుకు సూచనగా భావించాలి. అలాంటి కల వస్తే వీలైనంత తక్కువ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు పనిలో నిమగ్నమై ఉండడం మంచిది. చర్చలు, వాగ్వాదాలకు దూరంగా ఉండడం అవసరం.


విహారానికి వెళ్లే? 


స్నేహితులతో కలిసి విహారానికి లేదా షికారుకు వెళ్లినట్టు కల వస్తే.. జీవితం బోరింగ్‌గా ఉందని అర్థం. ఏదైనా చిన్న మార్పు కోరుకుంటున్నారని సంకేతం. మీకు మీ రోటీన్ నుంచి బ్రేక్ అవసరమని ఈ కల సూచిస్తుంది. ఇలాంటి కల వస్తే మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం.


Also Read : కలలో వాళ్లు కనిపిస్తున్నారా? దాని గురించి స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?






Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.