Dandakrama Parayanam Meaning: 19 ఏళ్ల యువ పండితుడు వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖే అసాధారణ ప్రతిభకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయ్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్ రేఖే గురించే చర్చ. ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎవ్వరూ ఊహించని విధంగా దండక్రమ పారాయణాన్ని వారణాసిలో కేవలం 50 రోజుల్లో విజయవంతంగా పూర్తిచేశారు. 200 సంవత్సరాల తర్వాత జరిగిన అరుదైన సాధన ఇది.శుక్ల యజుర్వేదంలో 2వేల మంత్రాలను ఒక్కసారి మద్యవ్యాప్తి లేకుండా ఉచ్ఛరించారు వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖే. ఈ సాధనకోసం రోజుకి నాలుగైదు గంటలు కఠిన సాధన చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ సాధనను మెచ్చుకున్నారు.
వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖే ఈ ఘనతను తర్వాతి తరాలు కూడా తప్పుకుండా గుర్తుంటుకుంటాయి. భారతీయ సంస్కతిపట్ల ప్రేమకలిగిన ప్రతి ఒక్కరికీ ఇది గుర్తుండిపోతుందని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు
వేదాల రక్షణకు ఇది మైలు రాయి అన్నారు యోగీ ఆదిత్యనాథ్ దండక్రమ పారాయణ అంటే ఏంటి?
దండక్రమం (Dandakrama) అనేది..వేదాల్లో ఓ ప్రత్యేకమైన పారాయణ పద్ధతి. ముఖ్యంగా శుక్ల యజుర్వేదంలో మంత్రాలను క్రమబద్ధంగా, నిరంతరంగా ఉచ్ఛరించే ప్రక్రియ ఇది. వేదపారాయణంలో మకుట అని పిలుస్తారు. ఎందుకంటే ఇది అత్యంత కష్టమైనది, కచ్చితమైన శబ్ధం, స్పష్టమైన స్వరం అవసరం. మంత్రాలను ఓ నిర్ధిష్ట క్రమంలో ఎలాంటి మధ్యవ్యాప్తి లేకుండా పఠించాలి. 2000 మంత్రాలను 50 రోజుల నిర్ధిష్ట సమయంలో పూర్తిచేయాలంటే దీనికి ఎంతో మానసిక, శారీరక క్రమశిక్షణ అవసరం అవుతుంది. దండక్రమ పారాయణ ఎందుకు చేస్తారు
ఆధ్యాత్మిక లాభాలు
వేదమంత్రాలు ఆత్మను శుద్ధి చేస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. దండక్రమం లాంటి క్రమశిక్షణ ద్వారా భక్తి, జ్ఞానం పెరుగుతుంది. ఆధునిక కాలంలో ఇది ఓ తపస్సు లాంటిది. దైవిక శక్తిని ఆకర్షిస్తుందని విశ్వాసం
వేద సంప్రదాయ రక్షణ
ఈ రకమైన పారాయణాలు వేదాలను శ్రుతి ..అంటే..చూసి చదవడం కాకుండా గుర్తుంచుకుని చదవడం ద్వారా కాపాడతాయి. ఆధునిక కాలంలో వేదాలు అంతరించిపోకుండా ఉండేందుకు ఇలాంటి సాధన దిశగా యువతను ప్రోత్సహిస్తుంది సామాజిక ప్రభావం
ఇలాంటి దండక్రమ సాధనలు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతాయి. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి లాంటి వ్యక్తుల పశంస, ప్రోత్సాహంతో ఇలాంటి సాధనలు మరింత ప్రచారం జరుగుతాయి..మరికొందరు అనుసరించే అవకాశం పెరుగుతుంది. యువతలో సాంస్కృతిక ఆసక్తిని పెంచుతాయి
వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖే (Vedamurti Devavrat Mahesh Rekhe) 19 ఏళ్ల యువ వేద పండితుడు. ఉత్తరప్రదేశ్ కాశీకి చెందిన వ్యక్తి. శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం ప్రాంతంలో గురుకులంలో వేద విద్యాభ్యాసం చేస్తున్నారు. తండ్రి పేరు మహేష్ రేఖే, తల్లి దేవీ రేఖే. చిన్నప్పటి నుంచీ వేదాలు, శాస్త్రాలపై అత్యంత ఆసక్తి చూపేవారు దేవవ్రత్.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం.
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?
కాశీ (వారణాసి) ముందు పుట్టిందా - భూమి ముందు పుట్టిందా, మీకు తెలుసా ఇది!