2022 ఏప్రిల్ 4 నుంచి 10 వరకూ వార ఫలాలు


మేషం
ఈ వారం స్టార్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి ఆదాయం పెరుగుతుంది. మీరు మీ పనితో చాలా సంతృప్తి చెందుతారు. నిరుద్యోగులు వారం ప్రారంభంలో నూతన ఉద్యోగం పొందుతారు. ముఖ్యమైన  సమాచారాన్ని పొందడం ద్వారా మనస్సు సంతోషంగా ఉంటుంది. వారాంతంలో, మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది.  సోమ, గురు, శుక్రవారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. మద్యం-మాంసానికి దూరంగా ఉండండి. కోర్టువ్యవహారాల్లో అజాగ్రత్తగా ఉండొద్దు. ఇతరుల వ్యవహారాలపై మీరు సలహా ఇవ్వకండి.


వృషభం 
ఈ వారం మీరు  శుభవార్త  వింటారు.  ఇంటి పెద్దల సలహాతో పని చేయడం మంచిది. కొత్త పనుల పట్ల మీలో ఉత్సాహం ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.  కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారంలో ప్రభావవంతమైన వ్యక్తుల ద్వారా కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలు మార్చుకునే ఆలోచన చేస్తారు. వారం మధ్య భాగం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఒకరి భావాలను మరొకరు గౌరవించండి. అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందడం మీకు కష్టంగా ఉంటుంది. వారం ప్రారంభంలో సాధారణంగా ఉంటుంది. చిన్న విషయానికి కోపం తెచ్చుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో మీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. అనవసర మాటలు కట్టిపెట్టండి. 


మిథునం
ఈ వారం బాగానే ఉంటుంది. దంపతుల మధ్య  సమన్వయం ఉంటుంది. ప్రేమికులు తమ మనసులోని మాటను వెల్లడిచేయగలరు. మీకు మేధోపరమైన చర్చలపై ఆసక్తి ఉంటుంది. ఆర్థిక విషయాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. ఈ వారం కెరీర్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి. ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. అధికారులతో సత్సంబంధాలు కొనసాగించండి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు డీల్ చేయవచ్చు. 


Also Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే
కర్కాటకం
స్వీయ అధ్యయనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు రహస్య శాస్త్రాలను అధ్యయనం చేయవచ్చు. మానసిక ఒత్తిడులు తొలగిపోతాయి.కెరీర్‌కు సంబంధించి విజయం సాధించవచ్చు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థిక సహాయం తీసుకునే ఆలోచన చేస్తారు.  మీరు మీ ప్రతిభను ఉత్తమమైన రీతిలో వ్యక్తపరచగలరు. వారం మధ్యలో కుజుడు సంచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఒత్తిడులు తొలగిపోతాయి. ప్రేమికులు వివాహానికి సంబంధించిన అడుగేయవచ్చు. మీ విజయాలతో మీరు చాలా సంతృప్తి చెందుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు సకాలంలో మందులు వాడాలి. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలి. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  


సింహం
ఈ వారం మీకు బాగానే ఉంటుంది. వ్యాపారంలో  ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహాయం లభిస్తుంది. వ్యాపార పనులపై ప్రయాణాలు చేస్తారు.  గృహ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు మీ సృజనాత్మక ప్రతిభను ప్రజల ముందు వ్యక్తపరచగలరు. ప్రజలు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. మీరు ఏదైనా పెద్ద పని చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు. రాజకీయ వ్యక్తుల్లో మీ స్థానం బలంగా ఉంటుంది. మీ జీతం పెరగుతుంది. వారం మధ్యలో శుభప్రదంగా ఉంటుంది. వివాహ సంబంధాలలో పరిమితులను జాగ్రత్తగా చూసుకోండి. ఆదివారం మీరు కొంచెం అసౌకర్యంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతో వాదనలు పెట్టుకోవద్దు.  కొంతమంది మిమ్మల్ని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నిస్తారు. అనారోగ్య సమస్యలున్నాయి, కోపం తగ్గించుకోండి. ఎవరితోనైనా వివాదం రావొచ్చు. విద్యార్థులకు శుభసమయం. 


కన్య
ఈ వారం  సానుకూలంగా ఉంటుంది. మీరు మీ పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వ్యాపారంలో లాభంతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. వారం మధ్యలో మీకు ఉన్నత ఆలోచనలు ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. నిర్ణీత సమయానికి ముందే తమ బాధ్యత పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి పట్ల ఎమోషనల్ గా ఉంటారు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.  పిల్లలు తమ చదువుపై దృష్టి సారిస్తారు. వారం చివరిలో శుభవార్తలు వింటారు. బంధువుల మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తప్పుడు చర్యలకు దూరంగా ఉండండి.  న్యాయపరమైన విషయాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.


Also Read: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి
తుల
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. ఈ వారం అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఆదర్శ వైఖరి కారణంగా ప్రజలు మిమ్మల్ని ఆరాధిస్తారు. కుటుంబంకోసం చేసే ఖర్చులు పెరుగుతాయి. పిల్లల వివాహాల గురించి చర్చ ఉండొచ్చు. జీవిత భాగస్వామి ద్వారా మీకు కలిసొస్తుంది.  సినిమా చూసేందుకు వెళ్ళొచ్చు. టూరిజానికి కూడా వారం బాగానే ఉంటుంది. మీరు ఏదో ఒక సంఘటన గురించి ఆందోళన చెందుతారు. కోపం పెరుగుతుంది. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.


వృశ్చికం
ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. గతంలో చేసిన శ్రమకు మంచి ఫలితాలు వస్తాయి. పాత వివాదాలను తెలివిగా పరిష్కరించుకునే దిశగా చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ అలసత్వ వైఖరి మీరు సృష్టించిన అవకాశాలను వృధా చేసేలా చేస్తుంది. అందుకే ఈ వారం చాలా యాక్టివ్‌గా ఉండాలి. మందులకు డబ్బులు ఖర్చుచేస్తారు . వ్యసనాలకు దూరంగా ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. ఈ వారం మీరు కొన్ని పనుల గురించి గందరగోళంగా ఉంటారు. 


ధనస్సు
ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితులతో వ్యాపారం, ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాలు పొందుతారు. మనసులో మాటను బయటపెడితే బంధం బలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. తప్పు జరిగినప్పుడు బాధపడకుండా సరిదిద్దుకోండి. ప్రయాణానికి ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. స్వీట్స్ ఎక్కువ తినొద్దు. పిల్లల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేని వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. బంధుమిత్రులకు కొన్ని సమస్యలు ఉండొచ్చు. అవివాహితులు తమ వివాహం గురించి ఆందోళన చెందుతారు. మీరు సత్సంగాన్ని ఆనందిస్తారు. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు.


మకరం
మీ ప్రత్యర్థులు ఈ వారం మీ ముందు చాలా బలహీనంగా ఉంటారు. మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ఇష్టపడతారు.  మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. మంచి వంటకాలను ఆస్వాదించండి. వారం చివరి భాగం మీకు ప్రత్యేకంగా శుభప్రదం. మీరు ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు.  ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు చదువులో కొంత ఇబ్బంది పడతారు. మీ పని పట్ల నమ్మకంగా ఉండండి. వారి కోరికలకు ప్రాధాన్యత ఇవ్వండి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారం ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించండి.


కుంభం 
ఈ వారం ఏం చేసినా సక్సెస్ అవుతారు. లాంగ్ టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. డబ్బు ఖర్చుచేస్తారు. మీరు అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. విద్యార్థులకు  స్కాలర్‌షిప్ వస్తుంది. పాత మిత్రులను కలుస్తారు. మీ ప్రేమను తెలియజేసేందుకు ముందడుగు వేయండి.  ప్రణాళికలను చక్కగా అమలు చేయగలుగుతారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారి జీతంలో పెరుగుదల ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు.  పొందవచ్చు. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు పొందడంలో ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. భారీ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రిస్క్ తీసుకోకండి. గాయపడే ప్రమాదం ఉంది జాగ్రత్త.
 
మీనం
మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది.  షేర్లలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. భాగస్వామ్యంతో పనులు ప్రారంభించడం లాభదాయకంగా ఉంటుంది. చాలామంది మిమల్ని చూసి స్ఫూర్తి పొందుతారు. మీ పని తీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో బదిలీలు జరిగే అవకాశం ఉంది. మంగళ, బుధవారాలు చాలా శుభప్రదమైనవి. అధిక ఖర్చుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. పరిచయం లేని వ్యక్తులతో అతిగా మాట్లాడొద్దు.  ఇతరుల అభిప్రాయాలను బట్టి మీ నిర్ణయాలు తీసుకోకండి. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు.  కుటుంబ అవసరాలు తీరుస్తారు. వారాంతంలో అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.