న ఇంట్లో ఉండే ప్రతి వస్తువు మీద భూమి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నటిక్ బలం ప్రభావం మాత్రమే కాదు.. ఇతర గ్రహాల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది. అందుకే వాస్తు, జ్యోతిషం రెండు ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. జ్యోతిష్యం అంటే తారలు, గ్రహాలు ఇతర దైవిక అంశాల ప్రభావం మానవ జీవితం మీద ఏవిధంగా ఉంటుందో తెలిపే శాస్త్రం. వాస్తు అంటే నివసించే లేదా పని చేసే ప్రదేశం ప్రభావం మీ రాశి, నక్షత్రం ఇతర జ్యోతిష్య అంశాల ప్రకారం మీ మీద ఎలా ఉంటుందో తెలియజేసే శాస్త్రం. ఈ సనాతన శాస్త్రాలు జీవితాన్ని సుగమం చేసి ప్రశాంతంగా గడిపేందుకు ఉపయోగపడతాయి. ఈ సూత్రాలు కేవలం నమ్మకాలు కావనేది వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం. చిన్న చిన్న జాగ్రత్తల వల్ల బతుకు సుగమం అవుతున్నపుడు వీటిని పాటించడంలో నష్టం లేదు. అందుకే ఆఫీసులు, ఇండ్ల నిర్మాణం సమయంలో ఈ విషయాల మీద తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. పంచభూతాల నుంచి వచ్చే ఎనర్జీ ని సరిగ్గా గ్రహించి మంచి ఫలితాలు అందించే కొన్ని వాస్తు టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.



  1. తూర్పు వైపు ఉండే కిటికి నుంచి ఎండ ఎక్కువగా ఇంట్లోకి ప్రసరించే విధంగా ఉండాలి. ఇలా ఉన్నపుడు ఇంట్లోకి ఐశ్వర్యం ప్రవేశిస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు సింహ రాశికి అధిపతి.

  2. ఈశాన్యం కేతు దిశ. ఈ దిక్కున గుమ్మనికి పక్కగా మెట్లు ఉండకూడదు. ఇలా ఉండడం దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది.

  3. ఈశాన్యం బృహస్పతి స్థానం కనుక దిక్కున పూజ గది ఉండడం మంచిది.

  4. ఉత్తరం, తూర్పు రెండు కూడా మెయిన్ ఎంట్రెన్స్ కు అనువైనవి. కానీ డోర్ పక్కన చెప్పుల రాక్ ఉండడం మంచిది కాదు. ఇది నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.

  5. మూడు కంటే ఎక్కువ ఎంట్రెన్స్ డోర్స్ ఉండడం అన్ లక్కీ. ఇది సమస్యలకు ఆహ్వానం పలకడమే.

  6. ఇంట్లో నదులు, సముద్రాలు, పువ్వుల తోటలు, మొక్కల పేయింటింగ్స్ ఉంటే అవి గుడ్ లక్ ని ఆహ్వానిస్తాయి.

  7. ఆగ్నేయం అగ్ని కొలువుండే దిక్కు. అందువల్ల ఇటు వైపు కిచెన్ ఉండడం మంచిది. వంట చేసే వారు తూర్పు దిక్కుగా నిలబడే విధంగా ఉండేలా ప్లాట్ ఫాం నిర్మించుకోవాలి.

  8. ఈశాన్యానికి బృహస్పతి అధిపతి. అందువల్ల అటువైపు తప్పనిసరిగా దేవుడి ఫోటోలు పూజస్థానం ఉండేలా చూసుకోవాలి. అయితే దేవుడి విగ్రహాలు లేదా పటాలు తూర్పు అభిముఖంగా ఉండాలి.

  9. హింసను ప్రతిబింబించే చిత్రాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి ఇంటిలోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తాయి.

  10. చంద్రుడు వాయవ్యాధిపతి ఈ దిక్కులో వ్యర్థాలు పడెయ్య కూడదు. చీకటిగా కూడా ఉండకూడదు. ఇలా చేస్తే ఇంట్లోని స్త్రీలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు.

  11. ఇంట్లో పనిచేయని గడియారాలు ఉంటే వెంటనే తీసి పడేయ్యండి. ఇవి ఇంట్లో నివసించే అందరి మీద నెగెటివ్ ప్రభావం ఉంటుంది.


Also Read: బెడ్ రూమ్‌లో అద్దం అక్కడ ఉందా? జాగ్రత్త, అది మీకే నష్టం!