వాస్తు జీవితంలోని ప్రతి అంశాన్ని గురించి చర్చిస్తుంది. ఇంట్లోని ప్రతి వస్తువు ఎలా అమర్చుకోవాలి. ఎలాంటి వస్తువు  ఏదిశలో ఉండాలి వంటి విషయాలన్నింటి గురించి కూడా వివరిస్తుంది. వాస్తును జీవన విధానంలో భాగం చేసుకుంటే కష్టాల బారిన పడకుండా నివారించవచ్చు.


మనం సంపద దాచుకునే అల్మెరాలో కొన్ని వస్తువులు అసలు పెట్టకూడదు. కొన్ని వస్తువులు తప్పకుండా పెట్టుకోవాలి. కొన్ని నెగెటివ్ వస్తువులు అల్మెరాలో పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అటువంటి వస్తువులు తీసెయ్యాలి.


డబ్చు విషయంలో ఇలాంటి నష్టాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం . లేదంటే, ఇబ్బందులు తప్పవని పండితులు హెచ్చిరస్తున్నారు.  తెలియక చేసే ఇలాంటి చిన్న తప్పులే జీవితాన్ని చిక్కుల పాలు చెయ్యవచ్చు.


సాధారణంగా డబ్బు, నగలు, ఇతర డాక్యుమెంట్ల వంటివి లాకర్లలో దాచుకుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే లాకర్లలో పెట్టుకుంటే సమస్య ఉండదు. కానీ రకరకాల ఇతర వస్తువులను పెట్టినపుడు రకరకాల ప్రతికూల శక్తులు చేరే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా డబ్బు వచ్చే దారి మూసుకుంటుంది. అలాంటి వస్తువులు ఏమిటో తెలుసుకుని అవి లాకర్లలో లేకుండా జాగ్రత్త పడాలి. 


వాస్తు ప్రకారం డబ్బు, బంగారం, విలువైన డాక్యూమెంట్లు దాచుకునే అల్మెరాలో కొన్ని వస్తువులను పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. ఈ నాలుగు వస్తువులు పొరపాటున మీ లాకర్ లో ఉంటే తప్పకుండా తీసెయ్యాలి.


పెర్ఫ్యూమ్స్


ఫెర్ఫ్యూమ్స్ అల్మెరాలో ఉంచకూడదు. చాలా మంది సుగంధ ద్రవ్యాలే కదా అని లాకర్ లో పెట్టుకుంటారు. కానీ  వాస్త ప్రకారం ఇది మంచిది కాదు. ఫెర్ఫ్యూమ్స్ అల్మెరాలో పెట్టుకుంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి. అందుపవల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.


అద్దం


కొంత మంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు. కానీ ఇలా అమర్చుకోవడం మంచిదికాదు. వాస్తు ప్రకారం ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది. అందుకే బీరువాలకు అద్దాలను అమర్చుకోవద్దు.


చిరిగిన కాగితాలు


చిరిగిన లేదా పనికి రాని కాగితాలను డబ్బుదాచుకునే బీరువాల్లో దాచకూడదు. వీటి వల్ల ప్రతి కూల శక్తి వేగంగా పెరుగుతుంది. ఫలితంగా ఇంట్లో ఆర్థిక నష్టాలు జరగవచ్చు. డబ్బుకు లోటు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కనుక పనికి రాని, లేదా చిరిగిన కాగితాలను లాకర్లలో దాచకూడదు.  


నల్లని వస్త్రం


చాలా మందికి డబ్బును వస్త్రంలో చుట్టి పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. అలా డబ్బు చుట్టి పెట్టే వస్త్రం నల్లని రంగులో ఉండకూడదు. నల్లని వస్త్రంలో చుట్టి పెడితే డబ్బు త్వరగా ఖర్చయిపోతుంది. నష్టాల పాలు కవచ్చు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


Also read : పితృదోషం ఉంటే జీవితం నరకమే - ఈ ఆటంకాలకు అంతే ఉండదు