వాస్తు ఇంటి ముఖ ద్వారం నుంచి బాత్రూమ్ వరకు అన్ని విషయాలను గురించి వివరిస్తుంది. ఇంటి దిశలు, దిశల్లో గదులు, గదిలో ఏర్పాటు చేసుకునే వస్తువుల అమరిక ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరిస్తుంది. ఇంట్లోని వంటిల్లు, హాల్, బెడ్ రూమ్ మాత్రమే కాదు, బాత్రూములు, వాటిలో ఉండే వస్తువుల గురించి కూడా చర్చిస్తుంది. కొన్ని వస్తువులు బాత్రూమ్ లో అసలు ఉండకూడదు. మనకు తెలిసో తెలియకో అలాంటి వస్తువులు బాత్రూమ్ లో ఉన్నపుడు వాస్తు దోషాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇలా బాత్రూమ్ లో పెట్టుకోకూడని కొన్ని వస్తువుల గురించి పండితులు అందిస్తున్న వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.


వాస్తు శాస్త్రంలో శక్తి ప్రవాహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ శక్తి ప్రవాహాన్ని అనుసరించి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ శక్తి ప్రవాహం ఆ ఇంట్లో నివసించే వారి జీవితాల మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లోని బాత్రూమ్ విషయంలో కొన్ని కచ్చితమైన వాస్తు నియమాలు ఉన్నాయి. వాటిన అనుసరించడం అవసరం. వాస్తు చెప్పినదాన్ని బట్టి కొన్ని వస్తువులు బాత్రూమ్ లో ఉంటే దరిద్రం చుట్టుకుంటుందట. వాటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడడం వల్ల ఇలాంటి వాస్తు దోషాల నుంచి తప్పించుకోవచ్చు.


పగిలిన అద్దం


వాస్తు వివరించిన దాన్ని బట్టి పొరపాటున కూడా బాత్రూమ్ లో పగిలిన అద్దాన్ని పెట్టుకోకూడదు. పగిలిన అద్దం ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు వస్తాయి. ఇది పేదరికాన్ని ఇంట్లోకి ఆహ్వానించే ప్రమాదం ఉంది.


పాడైన చెప్పులు


చాలా మంది పాడైపోయి తెగిపోయిన బాత్రూమ్ స్లిప్పర్ అలాగే బాత్రూమ్ లో వదిలేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది అసలు మంచిదికాదు. ఇలా తెగిపోయిన, పాడయి పోయిన చెప్పులు ఇంట్లో నెగెటివ్ శక్తి ప్రవాహానికి కారణం అవుతాయి. కనుక వాటిని వెంటనే బయట పడెయ్యాలి.


ఖాళీ బక్కెట్


బాత్రూమ్ లో ఎప్పుడు బకెట్ ఖాళీగా వదిలెయ్య కూడదు. ఖాళీ బకెట్ దురదృష్టానికి సంకేతం. కనుక బాత్రూమ్ లోని బకెట్ ఎప్పుడూ నిండుగా ఉంచుకోవాలి.


ట్యాప్ లీకేజి


బాత్రూమ్ లో ట్యాప్ లీకేజి సమస్య ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి. లేదంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. నెగెటివిటి చేరుతుంది. ఖర్చులు అధికమవుతాయి. డబ్బు నీళ్లలా వృథా అవుతుంది.


తడి వస్త్రాలు


బాత్రూమ్ లో తడి వస్త్రాలు ఉంచకూడదు. తడి వస్త్రాలను వెంటనే ఎండలో ఆరబెట్టాలి. వాటిని బాత్రూమ్ లో వదిలేస్తే సూర్య దోషం కలుగుతుంది.


వాస్తు ప్రకారం బాత్రూమ్ లో మొక్కలు ఉంచకూడదు. బాత్రూమ్ లో ఉంచిన మొక్కలు త్వరగా చనిపోతాయి. ఇంట్లో మొక్కుల చనిపోవడం ప్రతికూలతలకు కారణం అవుతుంది. వాస్తు దోషంగా మారుతుంది. కనుక బాత్రూమ్ లో మొక్కలు ఉంచకూడదు.


Also read : నిద్రకూ ఉన్నాయి వాస్తు నియమాలు - ఇలా చేస్తే మీ జీవితానికి కలిగే మేలు ఇదే!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.