వాస్తు పురాతనమైన నిర్మాణ శాస్త్రం. వాస్తును అనుసరించి కట్టిన ఇంటిలో ప్రశాంత, సమృద్ధి ఉంటాయి. అలాంటి నిర్మాణాల్లో నివసించేవారి జీవితం సుఖశాంతులతో గడిచిపోతుంది. వాస్తులో దిక్కులకు చాలా ప్రాధాన్యత ఉంటాయి. దిక్కులను అనుసరించి ఇంట్లోకి సానుకూల శక్తి లేదా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వాస్తుకు సంబంధించిన అనేక నియమాలు వ్యక్తిగత జీవితాల మీద ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. వాస్తు పరిజ్ఞానం కలిగిన పండితులతో ఇంటి వాస్తును పరీక్షించి చూసుకోవడం అవసరం. ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లు కూడా వాస్తు దోషాలకు కారణం అవుతాయి. కేవలం నిర్మాణం ఉండాల్సిన విధివిధానాలు మాత్రమే కాదు వాస్తు ఇంట్లో వస్తువుల అమరికను కూడా చర్చిస్తుంది. ఏ స్థానాన్ని ఎలాంటి పనులకు శాస్త్రంలో కేటాయించారో కూడా వాస్తు వివరిస్తుంది.


వాస్తును అనుసరించి కొన్ని పనులు వంటగదిలో, పడక గదిలో చెయ్యకూడదు. ఎలాంటి పనులు పడక గదిలో చెయ్య కూడదు, ఎలాంటి పనులు వంటగదిలో చెయ్యకూడదో తెలుసుకుందాం.


పడకగదిలో చెయ్యకూడనివి


మామూలు భోంచెయ్యడానికి డైనింగ్ హాల్‌ను వాడతాం. అంత పెద్ద ఇల్లు లేని వారు చిన్న డైనింగ్ టేబుల్ పెట్టుకొని అక్కడ  భోజనం చేస్తారు. లేదా హాల్లో కింద కూర్చొని తింటారు. కానీ ఈ మధ్య చాలా మంది మంచం మీద కూర్చుని తినటం అలవాటుగా మార్చుకున్నారు. కానీ ఇది అసలు చెయ్యకూడని తప్పు. వాస్తు ప్రకారం మంచం మీద కూర్చుని భోంచేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఫలితంగా దారిద్ర్యం దాపున చేరుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద కూర్చుని భోంచెయ్యకూడదు.


మంచం మీద కూర్చుని టీ, కాఫీ, జ్యూస్ ల వంటివి తాగి లేచి లోపల పెట్టేందుకు బద్ధకించి ఎంగిలి కప్పులు పక్కనే పెట్టేసుకుంటారు. తెలియక చేసే ఈ తప్పు వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరుతుంది. దిండుకింద రకరకాల వస్తువులు పెడుతుంటారు. అలా ఏది పడితే అది దిండు కింద దాచడం కూడా మంచిదికాదు. ఇది వ్యక్తిగత అభివృద్ధిని ఆటంకపరుస్తుంది.


కిచెన్ లో చెయ్యకూడని పనులు


ఇంట్లో వంటిల్లు ఆగ్నేయంలో నిర్మించుకోవడం మంచిది. వంటింట్లో భోంచెయ్యడం ఎప్పుడూ చెయ్యకూడదు. భోజనం చేసే ముందు వంటగదిలో నుంచి బయటకు రావాలి. రాత్రి భోజనాల తర్వాత వంటింట్లో ఎంగిలి పాత్రలు ఉంచకూడదు. ఇది అన్నపూర్ణా దేవికి కోపం తెప్పిస్తుంది. వంటగది ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకోవాలి. వంటగదికి ఎదురుగా బాత్రూమ్ ఉండకూడదు. ఇది పెద్ద వస్తుదోషానికి కారణం అవుతుంది. ఇలాంటి ఇంట్లో ధనం నిలవదు. క్రమంగా ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టి దారిద్ర్యానికి కారణం అవుతుంది.


Also read : సాయంత్రం వేళ శివుడికి అభిషేకం చేయవచ్చా?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial