Vastu Tips In Telugu: క్షీర సాగ‌ర మథనం సమయంలో తాబేలు ఉద్భవించిందని నమ్ముతారు. లోహపు తాబేలును ఇంట్లో ఉంచడం వాస్తులో చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఏ తాబేలును ఇంట్లో ఉంచుకుంటే శ్రేయస్కరమో, ఎలా ఉంచాలో తెలుసుకుందాం.

డబ్బుకు లోటు ఉండదువాస్తు ప్రకారం, స్పటిక తాబేలును ఇంట్లో ఉంచడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. తాబేలు ప్ర‌తిమ‌ విష్ణువుకు ప్ర‌తిరూప‌మ‌ని భావిస్తారు. అందువ‌ల్ల‌ దానిని ఇంట్లో ఉంచడం ద్వారా, విష్ణువు భార్య అయిన లక్ష్మీ దేవి కూడా ఇంట్లో నివసిస్తుంది ఫ‌లితంగా సానుకూల శక్తి ఉంటుంది. స్ఫటిక తాబేలును ఇంట్లో ఉంచేవారికి సంపద, ధ‌న‌ ధాన్యాలు లభిస్తాయి. అంతే కాకుండా స్ఫటిక తాబేలును ఇంట్లో ఉంచుకునే వారికి ఎలాంటి దుఃఖం, రోగాలు ఉండవు వారి జీవితకాలం పెరుగుతుంది.

Also Read : ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టే సూపర్ టిప్స్ ఇవే!

మంచి ఉద్యోగంఉద్యోగం రాక ఇబ్బంది పడే వారు వాస్తు శాస్త్రం ప్రకారం తమ ఇంట్లో స్పటిక తాబేలును ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మ‌ధ్య‌లో ఆగిపోయిన వారి పని పూర్తవుతుంది, ఇంకా పురోగతి ఉంటుంది. అంతే కాకుండా ఆఫీసులో లేదా బెడ్‌రూమ్‌లో కూడా ఉంచితే అదృష్టాన్ని పొందవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు.

స్ఫ‌టిక‌ తాబేలు ఉంచేందుకు నియమాలువాస్తు శాస్త్రం ప్రకారం, స్ఫటిక తాబేలును తమ ఇళ్లలో ఉంచే వ్యక్తులు మంచి శుభ ఫలితాలను పొందుతారు. అయితే మీరు దానిని ఏ దిశలో ఉంచుతున్నారో గుర్తుంచుకోండి. ఎందుకంటే సరైన దిశలో, సరైన స్థలంలో ఉంచినట్లయితే, మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇది సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుంది. ఇంటిలో ప్రతికూల శక్తులను ప్ర‌భావం చూప‌కుండా చేస్తుంది.. కానీ దానిని ఉంచే దిశను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. 

Also Read: ముందు ఈ వ‌స్తువుల‌ను ఇంట్లోంచి తీసేస్తే, పురోగ‌తి దానంతట అదే మొద‌ల‌వుతుంది.!

స్ఫటిక తాబేలును ఎక్కడ ఉంచాలి?

  •  మీ ఇంటి ఉత్తర దిశలో స్ఫటిక తాబేలును ఉంచవచ్చు.
  •  మంచి ఆరోగ్యం కోసం మీ స్ఫటిక తాబేలును తూర్పు వైపు ముఖం పెట్టండి.
  • మీకు నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే, మీ తల దగ్గర క్రిస్టల్ తాబేలు ఉంచండి.
  • మీ ఇంటి పూజా గదిలో, పసుపు వస్త్రంపై స్ఫటిక తాబేలు ఉంచండి.
  •  స్థిరమైన నిధుల ప్రవాహం కోసం మీ నగదు లాకర్‌లో క్రిస్టల్ తాబేలు ఉంచండి.
  • అమ్మకాలను పెంచుకోవడానికి ఈ తాబేలును మీ స్టోర్ లేదా షోరూమ్ నగదు డ్రాయర్‌లో ఉంచండి.
  • ఈ స్ఫటిక తాబేలును మీరు పౌర్ణమి వెలుగులో ఉంచినట్లయితే మీకు శక్తిమంతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
  • ఉపయోగంలో లేనప్పుడు స్ఫటిక తాబేలును కాటన్ బ్యాగ్‌లో ఉంచండి.

Also Read : లాకర్‌లో ఈ నాలుగు వస్తువులు ఉంటే దరిద్రం తప్పదు

స్ఫ‌టిక‌ తాబేలు ప్రయోజనాలు

  •  స్ఫటిక తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ డబ్బు స్థిరంగా ఉంటుంది.
  •  స్ఫటిక తాబేలు దీర్ఘాయువు జీవించడానికి మీకు సహాయం చేస్తుంది.
  •  మీ చుట్టూ ఉన్న వాతావరణం స్ఫటిక తాబేలు ద్వారా సమతుల్యం, శ్రావ్యంగా ఉంటుంది.
  •  స్ఫటిక తాబేలు ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • స్ఫటిక తాబేలు మీకు అదృష్టానికి ఆకర్షణ.
  • స్ఫటిక తాబేలు మీ పిల్లలు చదువుపై బాగా దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.