Pigeon Nest in House: కొన్ని ఇళ్లల్లో పావురాలు గూడు పెడుతుంటాయి. కొన్ని పావురాలు పిల్లలను కూడా పొదుగుతాయి. మరి, ఇంట్లో పావురాలు ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడం ఇంటికి మంచిదేనా? దీనిపై మన పూర్వికులు ఏం చెప్పారు?
పావురాలు గూడు కట్టుకుంటే మంచిదా.. కాదా అనేది రకరకాల కారణాలు, సంస్కృతులు, భౌగోళిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మన పరిసరాల్లో పావురం గూడు కట్టుకుంటే మంచిదా, కాదా అనే విషయం గురించి రకరకాల అభిప్రాయాలు ప్రాచూర్యంలో ఉన్నాయి. నగరాల్లో పావురాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వీటి చుట్టు రకరకాల విశ్వాసాలు, మూఢనమ్మకాలు కూడా చలామణిలో ఉన్నాయి. మరి పావురాల గూళ్లు, వాటి వల్ల ఎదురయ్యే మంచీ చెడులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెల్లపావురం చాలా మందికి ప్రియమైన పక్షి. దీన్ని ప్రశాంతతకు, శాంతికి చిహ్నంగా భావిస్తారు. పావురాలను చాలా సంస్కృతుల్లో శాంతికి, ఆశావాద దృక్పథానికి ప్రతీకలుగా పరిగణిస్తారు. అయితే పావురం గూడు కట్టడం గురించి మాత్రం మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి.
అదృష్టానికి సంకేతమా?
కొన్ని సంస్కృతుల్లో పావురాలు ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిదనే నమ్మకం ఉంది. అక్కడ ఎలాంటి నెగెటివిటి లేదని, కేవలం గుడ్ ఎనర్జీ మాత్రమే ఉందనేందుకు సంకేతంగా భావిస్తారు. పావురాలు, వాటి గూళ్లు పరిసరాల్లో ఉన్నాయంటే అది చాలా సురక్షితమైన స్థలంగా భావించాలట. పావురాలు అదృష్టాన్ని తెచ్చే పక్షులని, రక్షణ కల్పిస్తాయని నమ్మకం. పావురం గూడు మన ఇంటి పరిసరాల్లో కట్టుకుంటే.. ఏదో మంచి వార్త వినబోతున్నారని అర్థం.
దురదృష్టమా?
పైన చెప్పుకున్నవి విశ్వాసాలు, నమ్మకాలు మాత్రమే. కానీ సైన్స్ పావురాల గురించి కొన్ని విషయాలను చెబుతోంది. అవికూడా తెలుసుకుంటే మంచిది.
పావురాలు చాలా రకాల అలెర్జీలకు కారణం కావచ్చు. పావురాల ద్వారా వ్యాధులు కూడా వ్యాపించవచ్చు. వాటి గూళ్లలో చాలా రకాల వ్యాధికారక సూక్ష్మక్రిములు నివసించే ప్రమాదం ఉంది. ఇవన్నీ అనారోగ్యాలకు కారణం అవుతాయి. కనుక వీటిని దురదృష్టానికి సంకేతాలుగా భావించవచ్చు.
పావురాల రెక్కల్లోంచి ఈకలు రాలిపడడం వల్ల వాటి గూళ్లు ఉన్న ప్రదేశం శుభ్రంగా ఉండదు. వాటి రెట్టల వల్ల చాలా రకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు నిరంతరం వాటి శబ్ధాలతో చాలా డిస్టర్బెన్స్ గా కూడా ఉంటుంది. కాబట్టి.. వీలైనంత వరకు పావురాలు ఇళ్లల్లోకి చొరబడకుండా చూసుకోండి.
Also Read : Vastu Tips in Telugu : లివింగ్ రూమ్ గోడలకు గ్రీన్ కలర్ వెయ్యొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.