ప్రతి రంగుకి ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాస్తు శాస్త్రంలో ఇంటికి వేసుకునే వెల్ల గురించిన విషయాల ప్రస్థావన చాలా స్పష్టంగా ఉంది. ఏ రంగులు ఉపయోగించాలో వాస్తు వివరిస్తోంది. ఇంట్లో లివింగ్ రూమ్ గోడలకు ఆకుపచ్చని రంగు వెయ్యాలని అనుకుంటున్నారా? వాస్తు మరోసారి ఆలోచించటం మంచిదని చెబుతోంది. ఎందుకంటే?
ఇంట్లో సామరస్యాన్ని, పాజిటివిటిని నిలిపి ఉంచడమే వాస్తు లక్ష్యం. వాస్తు ప్రకారం ప్రతి రంగు తనదైన ప్రత్యేక శక్తి ప్రసరాన్ని కలిగి ఉంటుంది. అది కచ్చితంగా ఇంట్లో నివసించే వారి మీద ప్రభావం చూపుతుంది. ఆకుపచ్చని రంగు చెక్కను, ప్రకృతిని సూచించే రంగు. ఈ రంగును లివింగ్ రూమ్ లోఉపయోగించినపుడు చెక్కకు చెందిన శక్తిని ఎక్కువ ప్రసరింప జేస్తుంది. ఇది ఇంట్లోని స్థిరత్వానికి భంగం కలిగిస్తుంది.
లివింగ్ రూమ్ లోని గోడలకు గ్రీన్ కలర్ వాడినపుడు చెక్కను ప్రతిఫలిస్తుంది. ఇది ఇంట్లోకి వచ్చే సంపదకు ఆటంకాలు కలిగిస్తుంది. కనుక రావల్సిన డబ్బు రాదు. ఆర్థిక పరమైన అపజయాలు కలుగవచ్చు. కనుక లివింగ్ రూమ్ లో గ్రీన్ కలర్ వెయ్యక పోవడమే మంచిది.
ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరి మన:శాంతి కలిగించడం వాస్తు లక్ష్యాలలో ఒకటి. ఆకుపచ్చ రంగు లివింగ్ రూమ్‌లో ఉపయోగించినపుడు కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. అపర్థాలు చెలరేగి అనుబంధాలు బలహీనపడుతాయి. లివింగ్ ఏరియా ఎప్పుడూ కుటుంబంలో సామరస్యాన్ని కలిగించేట్టుగా ఉండాలి. కాబట్టి తప్పకుండా గ్రీన్ కలర్ లివింగ్ రూమ్‌కు వాడకూడదు.
లివింగ్ రూమ్‌కు వేసిన రంగు కళ్లకి ఎక్కువ శ్రమ కలిగించకూడదు. ఆకుపచ్చని రంగు లివింగ్ రూమ్‌లో వేసినపుడు వెలుగు ఎక్కువ రిఫ్లెక్ట్ కాదు. అందువల్ల అక్కడ కూర్చున్నపుడు ఉత్సాహంగా ఉండదు. చాలా త్వరగా నీరసించి పోతారు.
ఆకుపచ్చని రంగు ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది. అయితే ఇంట్లో గ్రీన్ కలర్ వాడితే ఆ ఇంట్లో నివసించే వారిలో శ్వాస సంబంధమైన సమస్యలు రావచ్చు. కనుక ఇంట్లో గోడలకు ఎక్కువ గ్రీన్ కలర్ వాడకపోవడమే మంచిది.
లివింగ్ రూమ్ లో గ్రీన్ వాడినపుడు వుడ్ ఎలిమెంట్ శక్తి ఎక్కువ ప్రసరిస్తుంది. అందువల్ల ఇంట్లో శక్తి అసమతుల్యత ఏర్పడవచ్చు. ఇది అంత శ్రేయస్కరం కాదు.
కనుక ఇంట్లో వేసే రంగులను ఎంపిక చేసుకునే ముందు వాస్తు చెప్పే కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం. కంటికి ఇంపుగా ఉండడం మాత్రమే కాదు, ఆ రంగులు ప్రసరింపజేసే శక్తులకు అనుగుణంగా ఇంట్లో ఏ గోడకు ఏరంగు మంచిదో నిర్ణయించుకోవడం ఎప్పుడైనా మేలు చేస్తుంది.
Also read : Vastu Tips In Telugu: ఇంట్లోకి ధనం ప్రవాహంలా రావాలా? మరి వంటింట్లో ఇలాంటి పనులు చెయ్యకండి
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.