Vastu Tips: వాస్తు ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటేనే ఆ ఇంట్లో శ్రేయస్సు ఉంటుందని వాస్తు శాస్త్రం కూడా చెబుతోంది. లేదంటే మనం ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నీళ్లలా ఖర్చు అవుతుంది. అంతేకాదు ఇంట్లో మనశ్శాంతి కూడా కరువవుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే ఇల్లు కట్టేటప్పుడు ప్రతీది ఖచ్చితంగా వాస్తు ప్రకారం ఉండాలని చెబుతున్నారు వాస్తు పండితులు. అయితే ఇల్లు పూర్తయిన తర్వాత ఇంట్లో కూడా వాస్తు ఉండాలి. లేదంటే మీకు ప్రతికూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వంటగదిలో కానీ, బాత్రూమ్ లో కానీ నల్లాలు లీక్ అయితే.. డబ్బు విపరీతంగా ఖర్చవ్వడం ఖాయమంటున్నారు పండితులు.
కుళాయి (ట్యాప్) నుంచి నీరు కారడం శ్రేయస్కరం కాదు:
వాస్తు ప్రకారంలో మీ ఇంట్లో ఎక్కడైనా కుళాయి నుంచి నీళ్లు కారుతుంటే..వెంటనే రిపేర్ చేయించండి. ఇంట్లో చుక్కనీరు కారినా కూడా అనవసరమైన ఖర్చులకు కారణం అవుతుందని వాస్తు శాస్త్రం అంటోంది. ముఖ్యంగా మీ వంటగదిలో కుళాయి నుంచి నీళ్లు కారుతుంటే వాస్తు పరంగా అది అస్సలు మంచిది కాదట. వంటగదిని అగ్నిదేవుడితో సమానంగా చూస్తారు. అగ్ని, నీరు రెండు కలిసి ఉన్న చోట సమస్యలు మొదలవుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కుటుంబ సభ్యుల అనారోగ్య క్షీణించడం, వ్యాపారం నష్టాలు రావడం, ఆర్థిక నష్టాలు ఇబ్బంది పెడుతాయి. ఏ ఇంట్లో అయితే నీటిని వృథాగా ఖర్చు చేస్తుంటారో ఆ ఇంట్లో ప్రతికూలవాతావరణం ఉంటుంది.ఇలాంటి సమస్యలన్నింటిని నుంచి బయటపడాలంటే వీలైనంత త్వరగా ఇంట్లో ట్యాప్ లను మరమ్మత్తు చేయించడం మంచిది.
ఈ దిశలో నీటి కుళాయి ఉండాలి:
వాస్తు ప్రతిదానికీ దిశానిర్దేశం చేస్తుంది. మన ఇంట్లో ఏర్పాటు చేసుకునే ట్యాప్ లు కూడా వాస్తు ప్రకారమే ఉండాలి. మనకు ఇష్టం వచ్చినట్లుగా ఏర్పాటు చేసుకుంటే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవల్సి వస్తుంది. వాటర్ ట్యాంక్ లేదా దానికి సంబంధించిన ఏదైనా సరే అమర్చడానికి..ఇంట్లో సరైన దిశలోనే ఏర్పాటు చేయాలి. నీటి కుళాయి కానీ ట్యాంకు కానీ ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈ దిశలో ఉంటే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి..ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో కుళాయి నుంచి నీరు కారడం చంద్రుని బలహీనతను సూచిస్తుంది. సరైన దిశలో కుళాయిని ఏర్పాటు చేస్తే చంద్రుడి బలం మీపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Also Read: మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ 3 ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండాలి - ఉన్నాయా మరి! - చాణక్యనీతి!
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.