Vastu Tips In Telugu: మీకు ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వడం ద్వారా వారిని ఆనందంగా ఉంచాలని అనుకుంటారు. బహుమతులు ఒక వ్యక్తి పట్ల మీకు ఉన్న శ్రద్ధను తెలియపరుస్తాయి. అయితే కొన్ని బహుమతులు వాస్తు శాస్త్రానికి విరుద్ధమని తెలుసుకోండి. అలాంటి బహుమతులు ఇస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్లేనని గుర్తుంచుకోండి.
1. పదునైన వస్తువులు
కత్తులు వంటి పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది ఇచ్చేవారితో పాటు స్వీకరించేవారికీ హానికరం. కత్తులు, కత్తెరలు, ఇతర పదునైన వస్తువులు దురదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు. ఎవరికైనా ఏదైనా పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం వలన విపరీతమైన వ్యతిరేక, ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అది అందుకున్న వారికి దురదృష్టాన్ని తెస్తుంది.
Also Read : ఇంట్లో ఏడు గుర్రాల పెయింటింగ్ పెడితే ఎలాంటి లాభాలు కలుగుతాయి.?
2. గడియారం
చాలా మంది తరచుగా గడియారాలను బహుమతులుగా ఇస్తారు. గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం వల్ల ఆయుర్దాయం ప్రతికూలంగా తగ్గుతుంది. అదే విధంగా గడువు తేదీలు దాటిన బహుమతులను ఇవ్వడం ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే అలా చేయడం వలన ఇచ్చే వ్యక్తికి, గ్రహీతకు మధ్య స్నేహం ప్రమాదంలో పడవచ్చు. అంతేకాకుండా వారిద్దరికీ దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వృద్ధులకు వాచీ లేదా గోడ గడియారం ఇవ్వడం మంచిది కాదు.
3. వాలెట్
పర్సులు, డబ్బు సంచులను బహుమతిగా ఇవ్వవద్దు. ఎందుకంటే అవి డబ్బును కలిగి ఉంటాయి. వీటిని మరొకరికి ఇవ్వడం ద్వారా, మీ సానుకూల ఆర్థిక శక్తిని బయటకి పంపుతున్నారు. అందువల్ల మీ వద్ద ధనం నిలబడదు. ఇందుకు బదులుగా, మీరు మీ ప్రియమైన వారికి వారి అభిరుచులకు సరిపోయే మంచి పుస్తకాన్ని ఇవ్వవచ్చు.
4. నీటితో అలంకరించిన వస్తువులు
వాస్తు శాస్త్రంలో అక్వేరియంలు లేదా ఇతర నీటితో నిండి ఉండే అలంకరణ వస్తువులు ఇంటికి అదనపు ఆకర్షణగా ఉంటాయి. అయినప్పటికీ, ఇవి బహుమతిగా పరిగణించలేరు. ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వడం ద్వారా, మీరు మీ కర్మ, శ్రేయస్సును వారికి అందజేస్తున్నట్లు భావించాలి.
Also Read : మీ ఇంట్లో ఈ చిన్న పొరపాటు చేస్తే అప్పుల భారం పెరుగుతుంది!
5. పనికి సంబంధించిన వస్తువులు
వాస్తు శాస్త్రం ప్రకారం, పని కోసం ఉపయోగించే స్టేషనరీ వంటి వస్తువులను ఇవ్వడం కూడా సరైనది కాదు. ఇలా చేయడం శ్రేయస్సును వ్యాప్తి చేయకపోగా, మీరు బహుమతి ఇచ్చిన వారి వృత్తి జీవితంలో విధ్వంసాన్ని సృష్టించవచ్చు. రచయిత లేదా సృజనాత్మక వృత్తిలో ఉన్నవారికి పెన్నులు, పుస్తకాలు తదితర బహుమతులను ఎప్పుడూ అందించవద్దు. మీ జీవితాంతం మీరు చేసిన అన్ని దాతృత్వ కార్యాల సేకరణను పెన్ను సూచిస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.