Vastu Tips for Pooja Room: హిందువుల ఇళ్లలో పూజ గదికి ఉండే ప్రాధాన్యం గురించి తెలిసిందే. ఇటీవల కొత్తగా ఇళ్లను నిర్మించుకుంటున్న వాళ్లు ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంట్లో ఆనందం, సామరస్యం, శ్రేయస్సు కోసం పూజ గది చాలా అవసరం. ఇందుకు వాస్తు సూత్రాలను పాటించడం కూడా చాలా అవసరం. అందుకు ఇలా చెయ్యండి. 


పూజ గది కోసం వాస్తు చిట్కాలు:



  • పూజగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం పూజగది శుభ్రం చేయాలి. దుమ్ము, ధూళి ఉండకుండా చూసుకోవాలి. ః

  • ప్రతిరోజూ పూజ చేసే సమయంలో తాజాగా పువ్వులను ఫొటోలపై పెట్టాలి. వాడిపోయిన పువ్వులను పూజకు వాడకూడదు.

  • మీ ఇంట్లో బలహీనమైన శక్తిని వదిలించుకునేందుకు పూజగదిలో దూపం వేయండి.

  • ఎప్పటికప్పుడు దేవతా విగ్రహాలను ఉత్తరం లేదా తూర్పు ముఖంగా ఉండేలా వాటిని మార్చండి.

  • చెడు శక్తిని బయటకు పంపించేందుకు.. ప్రతికూల శక్తిని ఇంట్లోకి రాకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు నీళ్లలో కలిపి పూజగదిని తుడవండి.

  • మీ ఇంటీరియర్ డిజైన్‌లో ఓం, స్వస్తిక, శ్రీ యంత్రం వంటి పవిత్ర చిహ్నాలను పెట్టించండి. ఈ చిహ్నల నుంచి సానుకూల శక్తి ప్రసరిస్తుందని శాస్త్రం చెబుతోంది.

  • పూజ గది గోడలపై డెకాల్స్ లేదా దీపాలు ఉన్న పెయింటింగ్స్‌తో అలంకరించండి. ఇవి విశ్వాసానికి చిహ్నంగా పనిచేస్తాయి.

  • పూజ గదిలో చెక్క ఫర్నిచర్ వస్తువులను ఉపయోగించండి. కలప శ్రేయస్సు సంకేతమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

  • పూజ గదిలో ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి.

  • పూజ చేస్తున్న సమయంలో చెడు ఆలోచనలు రాకుండా మీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేందుకు ధూప్ కడ్డీలను వెలగించండి. లేదంటే మంచి సువాసన వెదజల్లే అగరబత్తులను వెలిగించండి. మల్లె పువ్వులు, గంధం వంటి వాటిని ఉపయోగించవచ్చు. 


ఇలా అలకరించండి



  • దీపాలు, పాత్రలు, రాగి లేదా ఇత్తడివి అలంకరణ కోసం ఉపయోగించండి. ఈ లోహాలు పరిసరాలను శుభ్రపరుస్తాయి.

  • పూజ గదిని రకరకాలుగా అలంకరిస్తుంటారు. అలా కాకుండా గృహోపకరణాల కోసం లేత నీలం, పసుపు లేదా తెలుపు వంటి ప్రశాంతతను సూచించే రంగులను వాడటం మంచిది.

  • మంచి శక్తిని ఆకర్షించడానికి పూజ గది ప్రాంతానికి ప్రవేశం ద్వారం దగ్గర శక్తివంతమైన రంగోలి డిజైన్లను వేయండి. 


ఈ వాస్తు సూత్రాలు పాటించండి



  • వాస్తు ప్రకారం ఇంట్లో పూజగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి ఈశాన్య మూలలో పూజగది ఉండాలి.

  • ఈశాన్య దిశలో సానుకూల శక్తి ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఇది కుటుంబానికి ఆనందం, శ్రేయస్సును అందిస్తుంది.

  • స్వచ్చమైన ప్రదేశంగా పరిగణిస్తారు. పూజగదిని పడకగది లేదా వంటి గదిలో ఎప్పుడూ పెట్టకూడదు.

  • పడకగది విశ్రాంతి, ఏకాంతంగా గడిపే ప్రదేశం. కాబట్టి దైవారాధనకు సరైన ప్రాంతం కాదు.

  • వంట గది అన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసే ప్రదేశం కాబట్టి పలు శక్తులు కలిగి ఉన్న అనేక మంది అతిథులు వస్తుంటారు. అందుకే పూజ గదిని అలాంటి ప్రదేశంలో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. 


Also Read : ఈ రాశుల వారికి అసూయ ఎక్కువట - ఇతరుల సక్సెస్‌ను ఓర్చుకోలేరట!




Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.