Vastu Tips for a Puja House : వాస్తు శాస్త్రం ప్రకారం, పూజా గృహం కేవలం భక్తికి సంబంధించిన ప్రదేశం మాత్రమే కాదు, సానుకూల శక్తి , శాంతికి కేంద్రం కూడా. ఇంటిలో గుడిలో ధూపం, దీపం, అగరబత్తి , పువ్వులను సమర్పించే సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తోంది. అయితే ఈ వస్తువులను సరైన దిశలో నియమాలతో ఉంచడం వల్ల పూజ  ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది. అందుకే... వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గృహంలో దీపం, అగరబత్తి , పువ్వులను ఉంచడానికి సరైన నియమాలేంటో తెలుసుకోండి. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు , సానుకూలత పెరుగుతుందని చెబుతారు వాస్తు నిపుణులు.

Continues below advertisement

దీపం ఉంచడానికి వాస్తు నియమాలు

  • పూజా గృహంలో ఎప్పుడూ దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచండి.
  • పూజ చేసేటప్పుడు దీపం జ్వాల ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉండాలి.
  • సాయంత్రం సమయంలో ఇంట్లో నెయ్యి దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు
  • దీపాన్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచండి.
  • ఎకవత్తి దీపాన్ని వెలిగించకూడదు..శ్లోకంలో ఉన్నట్టే సాజ్యం త్రివర్తి సంయుక్తం ( మూడు వత్తులు కలిపిన దీపం) వెలిగించాలి

దీపజ్యోతిః పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః  దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమో'స్తుతే  

Continues below advertisement

దీపం శ్లోకం

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే  త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తు తే  

అగరబత్తి ఉంచడానికి వాస్తు నియమాలు

  • అగరబత్తిని ఎప్పుడూ దేవుని విగ్రహం లేదా చిత్రానికి కుడి వైపున వెలిగించాలి.
  • ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
  • ఆరిపోయిన అగరబత్తిని పూజా గృహంలో ఉంచడం వల్ల ప్రతికూలత వస్తుంది.
  • అగరబత్తి బూడిదను అక్కడక్కడ పారవేయడానికి బదులుగా మట్టి కుండలో వేయండి.

ధూపం  వెలిగించినప్పుడు పఠించాల్సిన శ్లోకం

వనస్పత్యుద్భవిర్దివ్యైః నానా గంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతాం  ఓం మహాగణపతయే నమః ధూపం ఆఘ్రాపయామి 

పువ్వులు సమర్పించేటప్పుడు వాస్తు నియమాలు

  • తాజా , సువాసనగల పువ్వులను మాత్రమే దేవునికి సమర్పించండి.
  • పూజా గృహంలో ఎప్పుడూ వాడిపోయిన లేదా రెక్కలు ఊడిన పువ్వులను దేవునికి సమర్పించవద్దు.
  • పువ్వులను ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచండి.
  • బిల్వపత్రం, తులసి , తామర పువ్వులను పూజ కోసం ఉపయోగించడం ఉత్తమంగా పరిగణిస్తారు
  • దేవునికి పుష్పాలు సమర్పించిన ఒక రోజు తర్వాత పువ్వులను మార్చండి.
  • పూలు పక్కింట్లో దొంగతనంగా కోసుకొచ్చి పూజ చేయవద్దు
  • పూలు తీసుకువచ్చే పరిస్థితి లేనప్పుడు.. అమ్మవారి పూజకోసం అయినా పసుపు, కుంకుమ....అయ్యవారి పూజకోసం అయితే అక్షతలు వినియోగించవచ్చు

ఈ నియమాలు పాటించడంలో మీకు తెలిసీ తెలియక లోపాలు ఉన్నా..మీ భక్తిలో లోపం ఉండకూడదు.. అప్పుడే సంపూర్ణ ఫలితం పొందుతారు

గమనిక: ఈ సూచనలు సాధారణ వాస్తు ,  సాంప్రదాయ నియమాలపై ఆధారపడి ఉంటాయి. ఇలాగే ఉండాలని లేదు. స్థానిక సంప్రదాయాలు, పండితుల సలహాలను బట్టి కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు. వీటిని అనుసరించే ముందు స్థానిక వాస్తు నిపుణులను  ఓసారి సంప్రదించి సలహాలు స్వీకరించండి. ఏం అనుసరించినా నమ్మకం ముఖ్యం అని గుర్తుంచుకోండి