Tirumala darshan Tickets :   తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారి కోసం ముందస్తుగా టిక్కెట్లు రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సులభ మార్గం గుండా సులభతరంగా  దర్శించుకోవాలంటే tirupatibalaji.ap.gov.in తోనే సాధ్యం అవుతుంది.. భక్తుల సౌఖర్యార్ధం ప్రత్యేక ప్రవేశ దర్శనాల నుంచి ఆర్జిత సేవలు, అంగప్రదక్షణ టిక్కెట్లను టీటీడీ వెబ్ సైట్లో టిటిడి జారీ చేస్తూ వస్తోంది.. ప్రతి నెల మూడవ వారంలో టిక్కెట్లను విడుదల చేస్తూ వస్తుంది టీటీడీ.. డిసెంబర్ మాసానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఈ నెల 11వ తేదీన ఉదయం 11గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. 



డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను నవంబర్ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.. ఇక శనివారం, ఆదివారం, సోమవారం, బుధవారం 15 వేల టిక్కెట్లు, మంగళవారం, గురువారం, శుక్రవారం 20 వేల టిక్కెట్లు జారీ చేయనుంది.. మొత్తం నాలుగు లక్షల ఎనభై వేల ప్రత్యేక ప్రవేశ టోకెన్లను డిసెంబర్ నెలలో టిటిడి జారీ చేయనుంది..   ఈ  విషయాన్ని గమనించి భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది. భక్తులు రూములు కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే దానికి వేరే తేదీ ఉంటుంది. డిసెంబర్ మాసం వసతి బుకిం్ సదుపాయం వారం రోజుల తర్వాత కల్పిస్తారు.  


టిక్కెట్లు లేకపోయినా దర్శనానికి వెళ్లేలా టీటీడీ ఏర్పాట్లు 


అంతే కాకుండా సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యంను సులభతరం చేస్తూ తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రంలో టైం స్లాట్ టోకెన్లను టిటిడి జారీ చేస్తుంది.. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగిలిన రోజుల్లో 15 వేల టోకెన్లు టిటిడి భక్తులకు అందిస్తోంది.. టికెట్టు కలిగిన భక్తులు నిర్ధేశించిన సమయంలో‌స్వామి వారిబదర్శన భాగ్యం చేసుకోవాలని చెప్తోంది.. ఇక టోకెన్లు పొందలేని‌ భక్తులు నేరుగా వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ కు చేరుకుని స్వామి వారి దర్శన భాగ్యం పొందేలా టిటిడి చర్యలు తీసుకుంది..


తిరుమలలో డిసెంబర్ నెలలో ఎక్కువ రద్దీ ఉండే అవకాశంఉంది. ఉద్యోగులు తమ సెలవులను మురిగిపోకుండా ఉపయోగించుకునేందుకు  ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారి మొదటి చాయిస్ తిరుమల యాత్ర అయ్యే అవకాశం ఉంది. అందుకే డిసెంబర్‌లో తిరుమల టిక్కెట్లకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.