Tirumala RS 300 Ticket Online Booking: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఆగస్ట్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్ లైన్‌లో దర్శన టికెట్లు అందుబాటులో ఉంచింది. అటు, తిరుమల, తిరుపతిల్లో ఆగస్ట్ నెలకు సంబంధించి గదులను మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు https://ttdevasthanams.ap.gov.in సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెల 23న (గురువారం) ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఆన్ లైన్ కోటాను రిలీజ్ చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు సైతం ఆన్ లైన్‌లో విడుదల చేశారు. అటు, ఈ నెల 27న తిరుమల - తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం 11 గంటలకు నవనీత సేవకు సంబంధించి టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. 


Also Read: Tirumala News: తిరుమల వెళ్లే వీఐపీలకు షాకింగ్ న్యూస్ - ఈ రోజుల్లో వెళ్లకపోవడమే ఉత్తమం, సామాన్య భక్తులూ..