క్కోసారి ఏళ్లుగా కూడబెట్టుకున్న డబ్బు కూడా పూర్తిగా ఖర్చయిపోయి రోడ్డున పడుతుంటారు. అలాంటి పరిస్థితులు ఎదురైనపుడు ఏం చెయ్యాలో పాలుపోదు. సంపాదించిన డబ్బు నిలవదు. లేదా సంపాదనే ఉండదు. ఇలా ఆర్థికంగా కష్టాల పాలవుతారు. ఆర్థిక నష్టం వల్ల అన్ని మానసిక, శారీరక, సామాజిక సమస్యలను తెచ్చిపెడుతుంది. అటువంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలను గురించి జ్యోతిష్య శాస్త్రం వివరాలు అందిస్తుంది. ఈ పరిహారాల గురించి తెలుసుకుని  వీటిని పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.



  • ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శుభ్రం చేసి రాగి పాత్రతో నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుందట. తీరైన సంపద ఎవరింటనుండు? దినదినము ముగ్గున్న లోగిళ్ల నుండు అని పాటలు కూడా ఉన్నాయి. అటువంటి ఇంట్లోకి ఎప్పుడు పేదరికం రాదని శాస్త్రం.

  • బుధ వారాన్ని లక్ష్మీ ఆగమన దినంగా భావిస్తారు. అందుకే బుధ వారం రోజున ఎటువంటి చెల్లింపులు చెయ్యకూడదని సూచిస్తున్నారు. అప్పు చెల్లించడం లేదా అప్పు ఇవ్వడం వంటివి చెయ్యకూడదు. ఈ రోజున చేసే ఖర్చు డబ్బు రాకకు ఆటంకం కలిగిస్తుంది.

  • అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కరుణాకటాక్షాలకు పాత్రులు కావచ్చని శాస్త్రం సూచిస్తోంది. కనుక అమావాస్య నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆరాదన చెయ్యాలి.

  • గురువారం రోజు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనలాభం జరిగితే దాన్లో కొంత భాగం దానం చెయ్యడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

  • అప్పు చెల్లించాల్సి ఉంటే మంగళ వారం రోజున అప్పుతిరిగి చెల్లించడం మొదలు పెట్టండి త్వరలోనే ఆ అప్పు తీరిపోతుంది.

  • ఉదయం ఇంటిని శుభ్రం చెయ్యకుండా బ్రేక్ ఫాస్ట్ చెయ్యకూడదు. ఎంత ఉదయాన్నే బయటకు వెళ్లాల్సి వచ్చినా సరే ఇంటిని శుభ్రం చెయ్యకుండా తాళం వేసి బయటకు వెళ్ళ కూడదు.

  • ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రం చేసుకోవాలి. పనికి రాని వస్తువులను బయట పడెయ్యాలి.

  • ఇంటి సింహ ద్వారాన్ని ద్వార లక్ష్మిగా బావిస్తారు. కనుక గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడెయ్యడం, గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావడం, గడపకు అటూ ఇటూ చెరో కాలు వేసి నిలబడడం చెయ్యకూడదు. ఇది ద్వార లక్ష్మిని అవమాన పరచినట్టవుతుంది. పసుపు కుంకుమలు ఉన్న గడపలు లక్ష్మిదేవికి ఆహ్వానం పలుకుతాయని శాస్త్రం చెబుతోంది.

  • చిల్లర నాణెలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసే వారికి లక్ష్మీ అనుగ్రహం ఎన్నటికీ లభించదు. కనుక వీటి విషయంలో నిర్లక్ష్యం కూడదు. చిల్లర డబ్బులను జాగ్రత్త చెసుకోవాలి. పువ్వులను కూడా దారిలో పడెయ్యడం చెయ్యకూడదు. తినగలిగేంత మాత్రమే అన్నం వండుకోవాలి. అంతే వండించుకోవాలి. ఎక్కువ తక్కువ వడ్డించుకుని పడెయ్యకూడదు.


Also read : ఈ రోజుల్లో అగరబత్తి వెలిగిస్తే పితృదోషం చుట్టుకుంటుంది


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.