మే 8 ఆదివారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 08- 05 - 2022
వారం: ఆదివారం  


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం


తిథి  :  సప్తమి ఆదివారం మధ్యాహ్నం  12.52 వరకు తదుపరి అష్టమి
వారం : ఆదివారం     
నక్షత్రం:  పుష్యమి ఉదయం 11.25 తదుపరి ఆశ్లేష 
వర్జ్యం :  రాత్రి 1.09 నుంచి 2.52  
దుర్ముహూర్తం :  సాయంత్రం 4.38 నుంచి 5.29
అమృతఘడియలు :  ఉదయం 6.23 నుంచి 8.08
సూర్యోదయం: 05:34
సూర్యాస్తమయం : 06:18


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: గ్రహదోషాలు తొలగించే నవగ్రహ గాయత్రి మంత్రం


సూర్యుని ఆరాధనకు ఆదివారం చాలామంచిది. సూర్యుడు నవగ్రహాలకు అధిపతి కావడంతో జాతకంలో ఉండే దోషాల నుంచి విముక్తి పొందేందుకు సూర్యారాధన ఉత్తమం అని పండితులు చెబుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిత్యం సూర్యుని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీకోసం సూర్యాష్టకం....


శ్రీ సూర్యాష్టకం


ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర|
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే||


సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్|
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||


లోహితం రథమారూఢం సర్వలోక పితామహమ్|
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||


త్రైగుణ్యంచ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్|
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||


బృంహితం తేజసాంవుంజం వాయురాకాశ మేవ చ|
ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్||


బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్|
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||


విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపకమ్|
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||


శ్రీ విష్ణుం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదన్|
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||


సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్|
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్||


అమిషం మధుపానంచ యఃకరోతి రవేర్దినే|
సప్తజన్మ భవేద్రోగి జన్మజన్మ దరిద్రతా||


స్త్రీ తైల మధు మాంసాని యస్త్యజేత్తురవేర్దినే|
నవ్యాధి రోగ దారిద్ర్యం సూర్యలోకం సగచ్ఛతి||


ఇతి శ్రీశివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం|


Also Read:  అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది


Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!