మే 15 సోమవారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 16- 05 - 2022
వారం: సోమవారం


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం


తిథి  :  పౌర్ణమి సోమవారం ఉదయం 10.08 వరకు తదుపరి పాడ్యమి
వారం : సోమవారం 
నక్షత్రం:  విశాఖ మధ్యాహ్నం 2.07 తదుపరి  అనూరాధ
వర్జ్యం :  సాయంత్రం 5.53 నుంచి 7.23  వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.22 నుంచి 1.14 వరకు తిరిగి  2.56 నుంచి 3.48
అమృతఘడియలు  :  ఉదయం 5.43 నుంచి 7.17
సూర్యోదయం: 05:32
సూర్యాస్తమయం : 06:20


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read:  2022-2023లో ఈ రాశివారి సక్సెస్ చూసి కొందరు సహించలేరు, ఆ రేంజ్ లో దూసుకెళతారు


సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. బోళాశంకరుడిని తలుచుకుంటే చాలు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. సోమవారం రోజు శివస్త్రోత్రాలు ఏవి చదువుకున్నా మంచిదే. ఈ రోజు మీకోసం ఉమామహేశ్వర స్తోత్రం  అందిస్తున్నాం. 


ఉమామహేశ్వర స్తోత్రం 


నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||


నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


నమః శివాభ్యామతిసుందరాభ్యా-
-మత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాలకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


నమః శివాభ్యామశుభాపహాభ్యా-
-మశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 


స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే
శతాయురాంతే శివలోకమేతి || 


ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణమ్ |


Also Read:  శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో