Tirumala Fastag : తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) అధికారులు ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఆగష్టు 15 నుంచి తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేసింది TTD.  

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుమలకు వేలాది భక్తులు నిత్యం తరలివస్తుంటారు. కాలినడకన శ్రీవారి సన్నిధికి చేరుకునేవారు కొందరు. సొంతవాహనాల్లో వచ్చి తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే భక్తులు మరికొందరు. టీటీడీ వాహనాల్లో కొండెక్కేవారు ఇంకొందరు. అయితే ఇకపై సొంతవాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఫాస్టాగ్ నియమం పాటించాలని కోరారు. ఆగష్టు 15 నుంచి తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ ఉండాల్సిందే అని టీటీడీ ప్రకటించింది.  

సాధారణంగా సొంత వాహనాల్లో తిరుమల (Tirumala) క్షేత్రానికి వెళ్లే భక్తులకు అలిపిరి చెక్ పాయింట్ వద్ద  చెకింగ్ తర్వాత కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక పర్వదినాలు, పండుగల సమయంలో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ఆసమయంలో అలిపిరి చెక్ పాయింట్ వద్ద వెహికల్స్ భారీగా బారులు తీరి ఉంటాయి. ఇలాంటప్పుడు తనిఖీ కేంద్రంవద్ద మెరుగైన భద్రతా ప్రమాణాలు కల్పించడంతో పాటూ, అధిక రద్దీని తగ్గించేందుకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) అధికారులు.

ఫాస్టాగ్‌ లేకుండా తిరుమలకు వచ్చిన వాహనదారులను వెనక్కు పంపించకుండా..వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్దICCI బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్‌ జారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్‌ లేని వాహనదారులు తక్కువ టైమ్ లోనే ఇక్కడ ఫాస్టాగ్ సౌకర్యం పొందొచ్చు. ఇప్పుడు కాదు తర్వాత తీసుకుంటాం అంటే తిరుమలకు అనుమతి ఉండబోదని అధికారులు తేల్చిచెప్పారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకంశ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ |శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబృ--న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయమ్ |చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభమ్నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

నందగోపనందనం సనందనాదివందితంకుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరమ్ |నందకారవిందశంఖచక్రశార్ఙ్గసాధనంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

నాగరాజపాలనం భోగినాథశాయినంనాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ |నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం--విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయమ్ |తారకాసురాటవీకుఠారమద్వితీయకంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 

ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్ |

బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

 ఐశ్వర్య మహామంత్రంతో అప్పుల బాధలు దూరం! శ్రీనివాస మంత్రం ఎలా రాయాలి, ఫలితాలు ఏంటి!..పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి