తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 2025 ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇవే..
ఏప్రిల్ 6 ఆదివారం శ్రీరామ నవమి ఆస్థానం
ఏప్రిల్ 7 సోమవారం శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం
ఏప్రిల్ 8 మంగళవారం సర్వ ఏకాదశి
ఏప్రిల్ 10 గురువారం నుంచి ఏప్రిల్ 12 శనివారం వరకు వసంతోత్సవాలు
ఏప్రిల్ 12 శనివారం చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి
ఏప్రిల్ 23 బుధవారం భాష్యకార్ల ఉత్సవారంభం
ఏప్రిల్ 24 గురువారం మతత్రయ ఏకాదశి
ఏప్రిల్ 30 బుధవారం పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ లో జరగనున్న విశేష ఉత్సవాలు
ఏప్రిల్ 3 రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామి ఊరేగింపు
ఏప్రిల్ 4, 18 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తారు
ఏప్రిల్ 6న శ్రీ రామనవమి రోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీపట్టాభిరామస్వామి వారిని మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు
ఏప్రిల్ 12 పౌర్ణమి , ఉత్తర నక్షత్రం సందర్భంగా గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు విహరిస్తారు
ఏప్రిల్ 22న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు
ఏప్రిల్ 23 నుంచి మే 2వ వరకు భాష్యకార్ల ఉత్సవం నిర్వహించనున్నామని టీటీడీ ప్రకటనలో తెలిపింది
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ నెలలో విశేష ఉత్సవాలు
ఏప్రిల్ 1 మంగళ వారం ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ ఉంటుంది
ఏప్రిల్ 4, 11, 18, 25వ తేదీల్లో ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం
ఏప్రిల్ 9 ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం
ఏప్రిల్ 22న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం జరుగుతుంది
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మార్చి నెరాఖరు, వారాంతం కావడం, సెలువులు మొదలవడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం ఉదయం మొత్తం 31 కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా టైమ్ పట్టింది. ఇక మార్చి 27 శుక్రవారం స్వామివారిని 64,279 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం
శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకంశ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ |శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||
ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబృ--న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయమ్ |చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభమ్నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||
నందగోపనందనం సనందనాదివందితంకుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరమ్ |నందకారవిందశంఖచక్రశార్ఙ్గసాధనంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||
నాగరాజపాలనం భోగినాథశాయినంనాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ |నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||
తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం--విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయమ్ |తారకాసురాటవీకుఠారమద్వితీయకంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||
ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్ |