Nagababu Latest News: జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబుకు ఉగాది నాటికి మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం సాగింది. దాదాపు నాలుగైదు నెలల క్రితమే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. అప్పటికి నాగబాబు ఎమ్మెల్సీ కూడా కాదు. ఇటీవలే ఆయనకు ఆ పదవి లభించింది. దానితో ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉంటుంది దానిలో భాగంగా నాగబాబు మంత్రి పదవి లభిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల ఆ ప్రక్రియకు చిన్న బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. 

Continues below advertisement


P4 ఎఫెక్ట్... నాగబాబు కి పంత్రి పదవి ఆలస్యం?
ఉగాది రోజు నాగబాబుకి మంత్రి పదవి లభిస్తుంది అని అందరూ భావించారు. జనసేన జనసైనికులు సంబరాలకు కూడా రెడీ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుప్రతిస్థాత్మకంగా ప్రకటించిన P-4 కార్యక్రమం ఉగాది రోజునే ప్రారంభం కాబోతోంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం కనీవినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. "పేదరిక నిర్మూలన అనే కాన్సెప్ట్‌తో పబ్లిక్ ప్రైవేట్ దాతల భాగస్వామ్యంతో జీరో పావర్టీ " కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభంకాబోతుంది. దీనికి వీలైనంత ప్రచారం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. కాబట్టి అదే రోజున మంత్రివర్గ విస్తరణ చేపడితే ప్రజల ఫోకస్ మారే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని మరికొద్ది రోజులపాటు వేయడానికి సీఎం మొగ్గుచూపినట్టు సమాచారం. కాబట్టి నాగబాబు మంత్రి పదవి తీసుకోవడానికి మరి కొంత సమయం పడుతోంది.


మంత్రి వర్గ విస్తరణా? పునర్వవస్తీకరణా?
ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో మరొక్క మినిస్టర్‌ని తీసుకోవడానికి చోటుంది. ఆ ఒక్క ప్లేస్‌ని జనసేనకి కేటాయిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నాగబాబుని మంత్రిగా తీసుకుని కేబినెట్‌ని పూర్తి చేస్తారనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. అయితే మరోవైపున కొంతమంది మంత్రుల తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తిగా ఉన్నట్టు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. పనితీరులో లాస్ట్ రావడంతోపాటుగా చంద్రబాబుతో ఇప్పటికే చివాట్లు తిన్న మంత్రులు ఉన్నారు. తన వేగాన్ని అందుకోలేకపోతున్నారంటూ అలాంటి వారిపై సీఎం స్వయంగా అసంతృప్తి వెళ్ళగక్కిన ఘటనలు లేకపోలేదు. అలాంటి ఒకరిద్దరు మంత్రులను తొలగించి కొత్త వాళ్లను తీసుకోవడమో లేక వాళ్ళ శాఖలను మార్చడమో వంటి కార్యక్రమం కూడా జరగడానికి ఛాన్స్ లేకపోలేదు అనేది ప్రస్తుతం టిడిపిలో జరుగుతున్న చర్చ. అదే గనక జరిగితే కేబినెట్ విస్తరణ బదులు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణను చేపట్టడానికే చంద్రబాబు మొగ్గు చూపుతారు అంటున్నారు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి కేటాయించడానికి కనీసం మరొక వారం రోజులు పట్టే అవకాశం ఉంది.