Varanasi Sanchari Song Lyrics: SSMB 29 నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజైంది. మహేష్ బాబు , ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ తో... రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీత దర్శకుడు. ఈమూవీ అప్టేడ్స్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకోసం ట్రీట్ ఇస్తూ ఈమధ్యే అప్టేడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. జక్కన్న. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా సంచారి అంటూ ఓ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు.
వారణాసి బ్యాక్ డ్రాప్ లో మొదలై ప్రపంచాన్ని చుట్టేసే ఈ సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజైంది. ఈ పాటలో ప్రతి పదం శివతత్వాన్ని సూచిస్తోంది. కాలాన్ని శాసించేవాడు, సంచారి సహా ప్రతి పదం రుద్రత్వం చుట్టూ తిరుగుతోంది. కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజూ పరుగేలే.. వేగాన్ని శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేను.. ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే .. రారా రారా ధీరా ధ్రువతార అంటూ సాగే ఈ పాటకు శ్రుతిహాసన్ తన వాయిస్ తో ప్రాణం పోసింది. ప్రతిపదాన్ని అర్థవంతంగా, గంభీరంగా పలికింది. ఈ పాటలో ప్రతి పదం... ధైర్యం, వేగం, సంహారం, సాహసాన్ని సూచిస్తున్నాయి..శివతత్వాన్ని వివరిస్తూ రాసిన ఈ పాటకు అర్థం ఇదే..
పల్లవి:కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగులే...వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే... ఖండాలే దాటేస్తూ కగరాజై వాలే...రా రా.. రా రా.. ధీర.. ధృవతారా... కాలాన్ని ఆదేశిస్తూ, రోజూ పరిగెత్తుతూ అనే ఈ లిరిక్ వెనుక.. శివుడు మహాకాలుడు – కాలాన్ని సృష్టించి, పాలించి, సంహరించే దేవుడు. నిత్య నటరాజులా నిరంతర చలనంలో ఉంటాడని అర్థం. వేగాన్ని శ్వాసలా తీసుకుంటూ గాలితో సమానంగా ప్రయాణించేవాడు.. పెనుగాలి లాంటి రుద్రుడు, వేగవంతమైన సంహార శక్తి కలవాడు అని అర్థం. ఇక్క శ్వాశ అంటే శివుడే అని అర్థం...ఎందుకంటే శివుడే ప్రాణదాత. విశ్వం మొత్తం వ్యాపించి ఉండే శివుడు.. భూమి, ఆకాశం సహా పంచభూతాలను తనలో లయం చేసుకుని లయకారుడు అయ్యాడు. అలాంటి సంచారిలా, గురుత్మంతుడిలాంటి వేగం, శివుడి వాహనం అయిన నంది శక్తిని కలగలుపుకుని అసుర సంహారం చేసే యోధుడు. ఎప్పటికీ నిలిచి ఉండే ధృవతారలా స్థిరమైనవాడు.. కైలాసం నుంచి సమస్తలోకాలకు సంచారి శివుడుని సూచిస్తూ సాగింది.
చరణం:సంచారి... సంచారి... నినదించే రణభేరి సంహారి... సంహారి... మృత్యువుపై తన స్వారి సంచారి... సంచారి... సాహసమే తన దారిసంహారి... సంహారి... అసురులపై అసిధారి
నినదించే రణభేరి అంటే ఇది శివుడి డమరుకాన్ని సూచిస్తోంది.. రణభేరి లాంటి శబ్దం, సృష్టి-సంహార నాదం. సంహారకుడు, మరణం మీద సవారీ చేసేవాడు అంటే ఎవరు? ఇంకెవరు శివుడే.. మృత్యువుపై సవారీ చేసే శ్మశానవాసి, మరణ భయం లేనివాడు పరమేశ్వరుడు. శివుడు వీరభద్రుడు – అసుర సంహారంలో ధైర్య స్వరూపుడు. శివుడు త్రిపురాంతకుడు – అసురులను (త్రిపురాసురులు) ఖడ్గం(అశి)తో సంహరించినవాడని అర్థం ఇంకా పాటలో ముఖ్యమైన అర్థాలు
సంచారీ = శివుడి నిరంతర తాండవం (నటరాజ స్వరూపం)సంహారీ = శివుడి రుద్ర / కాలభైరవ స్వరూపం – అసుర సంహారం మృత్యువుపై స్వారీ = మృత్యువును శాసించేవాడు, మృత్యుంజయుడు పరమేశ్వరుడే కాలాన్ని శాసిస్తూ = మహాకాలేశ్వరుడు – కాలచక్రాన్ని నడిపేవాడు
శివుడి శక్తి చుట్టూ తిరిగే ఈ పాట... ఆధ్యాత్మిక యోధుడి, శివభక్తుడి ప్రయాణాన్ని సూచిస్తోంది