Brahmamudi Serial Today Episode: ఇంట్లో వాళ్లను రాహుల్ క్షమాపణ అడుగుతాడు. దీంతో కావ్య కల్పించుకుని ఇంట్లో వాళ్లు అందరూ కాదు నిన్ను క్షమించాల్సింది స్వప్న అని చెప్తుంది. దీంతో రాహుల్ బాధగా స్వప్న దగ్గరకు వెళ్తాడు.
రాహుల్: స్వప్న నేను చేసిన తప్పుల వల్ల ఈ కుటుంబం ఎంత బాధపడిందో నాకు తెలియదు. కానీ నువ్వెంత సఫర్ అయ్యావో నాకు తెలుసు. కానీ దారుణం జరిగిపోయింది స్వప్న. ఇప్పుడు నేను మారి మనిషిని అవ్వడం తప్ప నేనేం చేయలేను. కానీ ఈ క్షణమే నాలో మార్పును మీకు చూపించాలి అనుకుంటున్నాను.. ఒక్క అవకాశం ఇవ్వు స్వప్న ఇంకెప్పుడూ నా వైపు తప్పు జరగనివ్వను నేను ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను
స్వప్న: నమ్మకం అనేది రాశులు పోసి ఉండదు రాహుల్. కనిపించగానే చేతిలోకి తీసుకోవడానికి.. నమ్మకం అనేది కళ్లకు కనిపించేది కాదు.. మనసుకు అనిపించేది. అది నిరూపణ అవ్వాలి. ఈ ఇల్లు అందరి ఇళ్లలాగా ఓ పది మంది తల దాచుకుంటున్న షెల్టర్ కాదు.. ఎవరెలా పోతున్నా వదిలేయడానికి అందరూ ఒకే మాటగా ఒకే మనసుతో ఒకే ఆలోచనతో పరువు ప్రతిష్టల కోసం బంధాలు పెనవేసుకుని బతుకున్న దేవాలయం.. అలాంటి దేవాలయంలో ఎవరు తప్పు చేసినా మిగిలిన అందరూ బాధపడాల్సి వస్తుంది. అది నువ్వు గుర్తించాలి. భార్యాభర్తల మధ్య క్షమాపణలు కాదు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం నాకు కలగాలంటే నీ మాటలతో కాదు నీ మనసులో నిరూపించు
అంటూ వెళ్లిపోతుంది. వెనకే రాహుల్ వెళ్తాడు. తర్వాత రాహుల్ దగ్గరకు రుద్రాణి వెళ్తుంది.
రుద్రాణి: వెళ్లి ఏంట్రా వాళ్లు అన్న మాటలకు అంతలా బాధపడుతున్నావా..? నువ్వు ఏదో తప్పు చేసినట్టు అంతలా కుమిలిపోతున్నావేంట్రా.?
రాహుల్: నేను చేసిన తప్పులు కుప్పలుగా పెరిగిపోయి నాకే భారంగా మారాయి మమ్మీ.. కనీసం ఏడ్చి అయినా ఆ భారాన్ని దించుకుందామనిపిస్తుంది
రుద్రాణి: సిగ్గు లేదురా ఆ మాట అనడానికి.. తప్పు చేసిన మగాడు ఏడవకూడదురా..? పంతం పట్టిన ఆడది పశ్చాతాప పడకూడదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీ మమ్మీయే.. అసలు నువ్వు ఏం తప్పు చేశావనిరా అంతలా బాధపడుతున్నావు.. తప్పు ఎవరైనా చేశారు అంటే ఈ ఇంట్లో వాళ్లు చేశారు. రేయ్ ఒక చోట తప్పు జరిగింది అంటే పరిస్థితులే కారణం అవుతాయి. పరిస్థితులు అంటే పై నుంచి ఏమైనా ఊడిపడతాయా..? పక్కనున్న మనుషులు పెట్టే పరీక్షలేరా పరిస్థితులు అంటే.. ఈ కుటుంబం అతా కలిసి నీకు పరీక్ష పెడుతూనే ఉన్నారు.. అయినా నువ్వు వాళ్ల ముందు నటిస్తున్నావేమో అనుకున్నాను.. కానీ నిజంగా మారిపోయావా..?
రాహుల్: ఇది నటన కాదు నిజంగానే నేను మారడానికి వాళ్లు నాకిచ్చిన మరో అవకాశం.. ఇప్పుడు కూడా నేను నీ మాట విని మారకపోతే ఈ కుటుంబానికే కాదు.. నా స్వప్నకు కూడా నేను తీరని అన్యాయం చేసిన వాడిని అవుతాను..
అంటూ రాహుల్ చెప్పడం రుద్రాణి తిట్టడం చాటు నుంచి స్వప్న వింటుంది.
రాహుల్: ఇక నన్ను మనిషిగా కాదు ఒక పురుగు కన్నా హీనంగా చూస్తారు. ఈ ఇంట్లోంచి శాశ్వతంగా గెంటేస్తారు…
రుద్రాణి: రేయ్ నీకు పిచ్చి పట్టిందిరా వాళ్లందరి మాటకు నీకు మతిపోయింది. అవన్నీ మాయ మాటలురా నమ్మొద్దు అడుక్కు తింటావు..
రాహుల్: జైళ్లో కూర్చుని చిప్ప కూడు తినే కంటే.. ఈ కుటుంబాన్ని నా భార్యను నమ్మి అడుక్కు తినడం ఎంతో గౌరవం మమ్మీ.. ఈ రోజు రాజ్, కావ్య కనక లేకపోయి ఉంటే.. నా గురించి కనక ఆలోచించకుండా ఉంటే చివరికి ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నేను కూయిలీని చంపానని పోలీసులు నమ్మారు.. ఆధారాలు ఉన్నాయి.. ఇంట్లో వాళ్లు నమ్మారు.. చివరికి నా భార్య కూడా అదే నమ్మింది. కానీ రాజ్, కావ్యలు మాత్రం నమ్మలేదు.. అందుకే నేను తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి నన్ను ఈ కేసు నుంచి బయటకు తీసుకొచ్చారు.. అంతటితో ఆగకుండా ఇన్ని తప్పులు చేసిన నన్ను కూడా క్షమించి ఇంట్లోకి కూడా రానిచ్చారు.. ఇంత చేసిన వాళ్ల కోసం నా ప్రాణమైనా ఇచ్చేయాలనిపిస్తుంది మమ్మీ.. కానీ నువ్వు ఇంకా వాళ్లకు ద్రోహం చేయాలి అంటున్నావు.. తప్పు మమ్మీ తప్పు చేస్తున్నావు..
రాహుల్ మాటలకు స్వప్న కళ్లల్లో నీళ్లు వస్తాయి.
రుద్రాణి: రేయ్ ఇన్ని ఆలోచిస్తే బతకలేవురా..?
రాహుల్: నాకు సలహాలు ఇవ్వకు మమ్మీ
అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రాజ్ రూంలో కావ్య గురించి ఆలోచిస్తుంటే.. కావ్య వచ్చి తనకు చికెన్ మంచూరియా తినాలని ఉందని చెప్తుంది. దీంతో రాజ్ దొంగ చాటుగా కిచెన్‌లోకి వెళ్లి చికెన్ మంచూరియా చేస్తుంటే ప్రకాష్ చూసి దెయ్యం అనుకుని అందరిని నిద్ర లేపి కిచెన్‌లోకి తీసుకెళ్తాడు. అందరినీ చూసి రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!