Srimad Bhagavatam: అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండడంతో పెళ్లికాని కుర్రాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. పైగా అమ్మాయిల రిక్వైర్ మెంట్స్ కూడా ఎక్కువైపోవడంతో సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఆ సమస్యలన్నీ పక్కనపెడితే సాధారణంగా అమ్మాయిలకు పెళ్లి ఆలస్యం అయితే రుక్మిణీ కళ్యాణం చదవమని,ధనుర్మాసం నెలరోజులు శ్రీ మహావిష్ణువును పూజించాలని చెబుతారు..మరి అబ్బాయిలు ఏం చేయాలి... వారికోసమే సర్వదేవకృత లక్ష్మీస్తోత్రం. 


" సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణం చేసి ప్రతి శుక్రవారం ఆవుపాలతో చేసిన పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే సమస్త సంపదలు కలుగుతాయని..వివాహానికి ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఇదే ఆ స్త్రోత్రం


Also Read:  మీరు నాన్ వెజ్ తింటున్నారా - అయితే ఈ 8 మందికి హింసాదోషం తప్పదు!


సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||
ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం 


Also Read: కలలో ఇవి కనిపిస్తే మీ తలరాత మారబోతోందని అర్థం


శ్రీ కృష్ణుడిని భర్తగా పొందేందుకు రుక్మిణీదేవి పడిన ఆరాటం, ఆమె కోరిక నెరవేర్చిన తీరు రుక్మిణి కళ్యాణంలో అద్భుతంగా వర్ణించాడు పోతన. ఇది చదివిన యువతులకు మంచి భర్త లభిస్తాడని విశ్వాసం... తాను వలచిన శ్రీకృష్ణుడిని రుక్మిణి ఇలా భావించింది (పోతన భాగవతంలోని ఓ పద్యం)


ప్రాణేశ! నీమంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల?
దయత! నీయధరామృతంబానగాలేని జిహ్వకు ఫలరససిద్ధి యేల?
నీరజాతనయన! నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని జన్మమేల యెన్ని జన్మములకు?


శ్రీకృష్ణ! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ. పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అందమెందుకు దండగ. ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ. ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండుగ. పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ. మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగైన జన్మ ఎందుకు. నాకు వద్దు.”


రుక్మిణి తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు యెంతకీ తిరిగి రాకపొయేసరికి 'ఏమైనదో ఏమో'నని రుక్మిణీదేవి చింతించే సమయంలో మరో పద్యం


ఏల నాస్వామి రాడేమి కతమొ ? భూసు రేంద్రు డగ్నిద్యోతు డేగె, వృద్ధు
డాయసపడి, దుర్గమారణ్య మార్గమున్ గడచెనో? కడిచినా, కడలినధిగ
మించి ద్వారకపురమేగెనో? యేగిన మాధవు దర్శన మతనికాయె
నో ! లేదొ ! వినియేమను కొనెనో మనమున, దయచేయతలచునో, తలపడేమొ?
రుక్మిణి దేవి దేవాలయములో అమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తుంది.
నమ్మితి నా మనంబున సనాతునులైన యుమామహేశులన్
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పె
ద్దమ్మ దయాంబురాశిది గదమ్మ హరింబతిసేయమ్మనిన్
నమ్మిన వారి కెన్నటికి నాశము లేదు గదమ్మ యీశ్వరీ