Sri Rama Navami 2025: 

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే  సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే  

తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 6 ఆదివారం నుంచి ఏప్రిల్ 8 మంగళవారం వరకు శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.

ఏప్రిల్ 6 ఆదివారం  శ్రీ రామనవమి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.  ఉదయం 8 నుంచి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం జరిపిస్తారు.  మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై  శ్రీరామ చంద్రుడు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు

రామకోటి రాసేటప్పుడు చేయకూడని తప్పులేంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం  

ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు TTD పరిపాలనా భవనం నుంచి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుంచి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. కల్యాణ వేడుకలో పాల్గొనే దంపతులకు  ఉత్తరీయం, రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం 

ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుంచి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు. ఆ తర్వాత  సీతారామలక్ష్మణులను బంగారు తిరుచ్చిపై , ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు చేస్తారు.

రామచంద్రుడి శ్లోకాలతో శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి 

ఏప్రిల్ 9 బుధవారం సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్స‌వం, ఆస్థానం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు 

శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదు సార్లు, రెండోరోజు ఏడుసార్లు, చివరి రోజు తొమ్మిదిసార్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో  మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయంసీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపంఆజానుబాహుం అరవిందదళాయతాక్షంరామం నిశాచర వినాశకరం నమామిశ్రీరామనవమి శుభాకాంక్షలు