Rama Navami 2024: మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడు చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జన్మించాడు. ఈ రోజున రామ నవమి పండుగను శ్రీరాముని జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా జీవితంలో అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. ఈ సంవత్సరం 2024లో, రామ నవమి ఏప్రిల్ 17న జరుపుకుంటారు. శ్రీరామ నవమి రోజున భక్తి, విశ్వాసంతో చేసే కొన్ని పనులు మీకు ఎంతో మేలు చేస్తాయి.


ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే..


డబ్బు కొరతను అధిగమించడానికి, రామ నవమి రోజు సాయంత్రం ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని, ఆ ఎర్రటి వస్త్రంలో 11 గోమతి చక్రం, 11 కౌరీలు, 11 లవంగాలు 11 బాతాష్‌లను కట్టి శ్రీరాముడు, సీతాదేవికి సమర్పించండి. ఒక గిన్నెలో నీటిని తీసుకుని, రామరక్ష మంత్రాన్ని 'ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః' అని 108 సార్లు జపించండి. ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి.


సంతానం కలగాలంటే?


సంతానం కలగాలంటే రామ నవమి రోజున కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతకు సమర్పించి 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.


జీవితం సంతోషంగా సాగాలంటే..


జీవితంలో ఆనందం, శాంతిని కొనసాగించడానికి, రాముడి ముందు నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించి, 'శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్' అని 108 సార్లు జపించండి.


వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే..


వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి, రామ నవమి నాడు సాయంత్రం, ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్లి, హనుమాన్ చాలీసా పఠించి, 'ఓం హనుమతే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.


వివాహంలో అడ్డంకులు:


వివాహంలో అడ్డంకులు తొలగించడానికి, రామ నవమి నాడు సాయంత్రం సీతారాముడికి  పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించండి. 108 సార్లు 'ఓం జై సీతా రామ్' అని జపించండి.


రామ నవమి నాడు ఈ పనులు చేయకండి:


⦿ తామస ఆహారాలు, మాంసాహారం మరియు మద్యపానం మానుకోండి.


⦿ ఈ సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారుచేసిన ఆహారాన్ని తినండి.


⦿ నవరాత్రులలో, జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం మానేయాలి.


శ్రీరామనమవి రోజు రాముడిని ఇలా పూజించండి:


రామ నవమి రోజున బ్రహ్మ ముహూర్తమున లేచి, స్నానము మొదలగునవి చేసి ఉపవాస వ్రతము చేసి శ్రీరాముని బాల రూపమును పూజించాలి. బాల రాముని విగ్రహాన్ని పూజించాలంటే ముందుగా ఊయల అలంకరించి మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజించాలి. రాగి కలశంలో మామిడి ఆకులు, కొబ్బరి, తమలపాకులు మొదలైన వాటిని వేసి బియ్యపు కుప్పపై కలశం వేసి దాని చుట్టూ నాలుగు ముఖాల దీపం వెలిగించాలి. దీని తరువాత, శ్రీరాముడికి పాయస, పండ్లు, స్వీట్లు, పంచామృతం, కమలం, తులసి, పూల మాల సమర్పిస్తారు. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత, మీరు విష్ణు సహస్రనామాన్ని జపించాలి. పంచామృతంతో పాటు బెల్లం లేదా పంచదార కలిపిన ప్రసాదాన్ని కూడా ఈ రోజు పంచుతారు.


మీరు సాధారణ ఆచారాల ప్రకారం రామ నవమి నాడు శ్రీరాముడిని పూజించాలనుకుంటే, మీరు పైన పేర్కొన్న నియమాలను పాటించవచ్చు. ఇది మీరు రామపూజ  పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. శ్రీరామనవమి రోజు ఈ పనులు చేస్తే జీవితంలో మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. 


Also Read: ఈ తరం పిల్లలకి రామాయణం గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఆలయానికి వెళ్లండి!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.