Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple: అప్పలాయగుంట..ఇక్కడ ప్రసన్న వేంకటేశ్వరస్వామిగా కొలువయ్యాడు శ్రీ వేంకటేశ్వరుడు. ఈ ఆలయంలో జూన్ 03న శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. జూన్ 06 నుంచి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జూన్ 6వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.
అప్పలాయగుంటలో కోలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
శ్రీ వేంకటేశ్వరుడు పద్మావతితో కలసి నారాయణవనంలో విహరించిన తర్వాత తిరుమలకు చేరుకునే మార్గంలో చాలా ప్రాంతాల్లో సంచరించాడు. వాటిలో ఒకటి అప్పలాయగుంట. స్వామివారు స్వయంగా వెళ్లి అక్కడ భక్తులను అనుగ్రహించడంతో ప్రసన్న వేంకటేశ్వరస్వామిగా పూజలందిస్తారు. ఈ ప్రదేశం నుంచి నేరుగా కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలులు ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టుమార్గంలో తిరుమల చేరుకున్నారు. ఈ అప్పలాయగుంట ప్రాంతాన్ని అప్పట్లో అన్ఋణ సరోవరం అని పిలిచేవారు. అంటే బుణం లేని సరోవరం అని అర్థం. దీనివెనుక ఓ కథ చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడట. పేరుకి తగ్గట్టుగా అందరి దగ్గరా అప్పులు చేస్తుండేవాడు. అదే ఊరికి చెందిన కొందరు అందరి దగ్గరా అప్పులు చేస్తాడనే పేరుంది కాబట్టి..తమ వద్ద కూడా అప్పు చేశాడని అబద్ధం చెప్పారట. ఆ డబ్బులు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. అప్పుడు అప్పులయ్య మాత్రం తాను వారి దగ్గర అప్పు చేయలేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. దీంతో ఓ రాయిపై నేను రుణం తీసుకోలేదు అని రాసి ఆ పక్కనే ఉన్న కోనేరులో పడేశాడట. వాస్తవానికి రాయి నీటిలో మునగాలి కానీ అప్పు తీసుకోలేదని అప్పులయ్య రాసిన రాయి నీటిలో తేలింది. దీంతో తను నిజమే చెబుతున్నాడు..భగవంతుడే సాక్షి అని నమ్మారట అంతా. అప్పటి నుంచి ఆ కోనేరుని అన్ఋణ సరోవరమనేవారు.మరో కథనం ప్రకారం అప్పలయ్య అనే వ్యక్తి ఇక్కడ ఓ గుంట తవ్వించాడని అప్పటి నుంచి అప్పలయ్యగుంటగా మారిందని చెబుతారు.
ఎత్తైన కొండలు, పంట పొలాలతో ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, ఆ వెనుక అంతరాలయం, ఎదురుగా గర్భ గుడిలో శ్రీవారి దివ్య మంగళ రూపం కనిపిస్తుంది. ఇక్కడ ఆండాళ్, పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. శ్రీవారి ఆలయం ఎదురుగా కోనేరు, ఆ సమీపంలో ఆంజనేయుడి ఆలయం ఉంటుంది. తిరుపతి నుంచి ప్రతి అరగంటకు ఓబస్సు ఉంటుంది..ఇక్కడికి సులువుగా చేరుకోవచ్చు.
తిరుమలలో శ్రీవారికి జరికే కైంకర్యాలే అప్పలాయగుంటలో ప్రసన్న వేంకటేశ్వరుడికి జరుగుతాయి. ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా జూన్ 03 మంగళవారం శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
జూన్ 7 - ధ్వజారోహణం పెద్దశేషవాహనసేవజూన్ 8 - చిన్నశేష వాహనం, హంస వాహనంజూన్ 9 - సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనంజూన్ 10- కల్పవృక్ష వాహనం, శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనంజూన్ 11 - మోహినీ అవతారం, గరుడ వాహనంజూన్ 12 - హనుమంత వాహనం, గజ వాహనంజూన్ 13 - సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనంజూన్ 14 - రథోత్సవం, అశ్వవాహనంజూన్ 15 - చక్రస్నానం ధ్వజావరోహణం