Spirituality:  ఆడవారు వేదమంత్రాలు ఎందుకు చెప్పకూడదన్న ప్రశ్న తరతరాలుగా ఉంది..రానున్న తరాల్లోనూ ఉద్భవించవచ్చు కూడా. అయితే మన పూర్వీకులు , పండితులు ఏ నియమాలు చెప్పినా వాటివెనుక తప్పనిసరిగా సహేతుకమైన కారణం ఉంటుంది. ఇలాంటి వాటిలో ఒకటి మహిళలు ఎందుకు వేదాధ్యయనం చేయరాదన్నది. దీనికి సమాధానం ఇదే...


Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది


వేదాలు స్వరం మాత్రానుగుణంగా ఉచ్ఛరించాలి. అయితే పురుషదేహ నిర్మాణానికి, స్త్రీ దేహ నిర్మాణానికి వ్యత్యాసం ఉంటుంది. నాడీమండల వ్యవస్థ ఆడవారికి సరైన స్వరోచ్చారణకు పూర్తిగా సహకరించదు. పురుషుల వోకల్ ఫోల్డ్స్/కార్డ్స్ 17mm-25mm పొడవు ఉంటే..స్త్రీలకు 12.5-17.5mm వుంటుంది, దీనివల్ల వారి పిచ్ లో తేడా వుంటుంది. వేద మంత్రాలన్నీ ఉదాత్త, అనుదాత్త, స్వరానుగుణంగా ఆయా స్థాయిలో ఉచ్ఛరించాలి కాబట్టి ఇది స్త్రీలకు పూర్తిగా సాధ్యపడదు



  • వేదమంత్రాల స్వరాలు నాభినుంచి పలకవలసి వస్తుంది. దానివల్ల పొత్తికడుపు మీద ఒత్తిడి ఎక్కువ కలుగుతుంది. స్త్రీ శరీరనిర్మాణం ప్రకారం వారికి ఇలాంటి ఒత్తిడి పెరిగితే అది రుతుక్రమం మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది.

  • ఇప్పటికీ వైద్య విధానాల్లో సంగీత థెరపీ వలన రోగులలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం, తక్కువ చేయడం శాస్త్రీయంగా నిరూపితమైంది. వేదం చదవేటప్పుడు శబ్ధం ప్రధానం. ఈ శబ్దప్రకంపనల వలన ఈస్ట్రోజెన్ తదితర హార్మోన్లపై ప్రభావం అధికంగా ఉండి..కాలక్రేమణా గర్భ శ్రావాలు కూడా జరిగే ప్రమాదం ఉంది

  • వేదమంత్రాన్నితప్పుగా ఉచ్ఛరిస్తే రావాల్సిన ఫలితం రాకపోగా వ్యతిరేక ఫలితం వస్తుంది. మరీ ముఖ్యంగా గురూపదేశం లేకుండా సరైన ఉచ్ఛారణ సాధ్యం కాదు

  • సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం చూసినా...ఆడవారికి మెనోపాజ్ వరకు వారిని చాలా శక్తివంతమైన హార్మోన్లు కాపాడతాయి, ఒకసారి ఆ సమయం వచ్చాక వారికి ఒక్కసారి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుందని పరిశోధనలలో వెల్లడైంది. అందుకే వారికున్న రక్షణాత్మక కవచాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పనులు వద్దని నిషేధించారు. అందులో ఒకటి వేదాధ్యయనం.

  • యుగధర్మ ప్రకారం ఆడవారికి ద్విజత్వం సిద్ధించదు, ఎందుకంటే వారికి ఉపనయన సంస్కారం ఉండదు కాబట్టి గాయత్రి మంత్రోచ్చారణ కానీ వేదపఠన కానీ వద్దని చెప్పారు. 


Also Read: ఏప్రిల్ 29 రాశిఫలాలు, ఈ రాశివారు లాభాలకోసం తాపత్రయపడి ఉచ్చులో చిక్కుకోవద్దు


ఆడవారిని తక్కువ చేయడం కాదు


ఈ విషయంపై అన్నింటా సగం అంటూ చర్చలు పెట్టి..మహిళలు ఎందుకు వేదాధ్యయనం చేయకూడదని హడావుడి చేసేవారున్నారు. అయితే ఈ నియమం కేవలం మహిళల ఆరోగ్యం కోసం పెట్టినది మాత్రమే. అంతమాత్రాన వేదాలు చదవకూడదు, వాటి గురించి తెలుసుకోవద్దని కాదు. వేద వ్యాఖ్యానాలు పూర్తిగా చదివి తత్త్వం తెలుసుకోవచ్చు. సౌందర్యలహరి, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వంటి ఎన్నో శక్తివంతమైన స్తోత్రాలు, వివిధ దేవతల శ్లోకాలు, దివ్యప్రబంధాలు, పురాణ ఇతిహాసాలు, భజనలు, కీర్తనలు మహిళలు తప్పక చదవమంటోంది శాస్త్. ఎన్నో నోములు, వ్రతాలు , నిత్య పూజలు..వేటికీ స్త్రీలు దూరం కాదు. 


“ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా”, (ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం) కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం.


ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము…
వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే పురుషులే చెబుతారు...