పసుపు కుంకుమ..సుమంగళీ చిహ్నాలైన ఈ రెండింటికీ హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటికి అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా బొట్టు పెట్టి మరీ పంపిస్తారు. ఏదైనా శుభకార్యానికి ఆహ్వానించినప్పుడు కూడా బొట్టుపెట్టి పిలుస్తారు. పుట్టింటికి వెళ్లిన ఆడపిల్లలు అత్తారింటికి వెళ్లేటప్పుడు పసుపు-కుంకుమ అందించి పంపిస్తుంటారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే పసుపు, కుంకుమ ఒక్కోసారి పొరపాటున చేజారిపడిపోతుంది. అలాంటప్పుడు చాలామందిలో భయం మొదలవుతుంది. అదో అపశకునం అని, ఏదో చెడు జరగబోతోందని భావిస్తారు. ఆ రోజంతా ఏదో ఆలోచనలోనే ఉండిపోతారు. అయితే ఇది ఏ మాత్రం నిజం కాదని కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు. 



  • అనుకోకుండా కుంకుమ కింద పడినప్పుడు అలా పడినచోట భూదేవికి బొట్టుపెట్టి మిగతా కుంకుమను  చెట్లలో వేయాలి 

  • మంగళ, శుక్రవారాల్లో కుంకుమ కిందపడిందంటే చాలా ఫీలైపోతారు. కానీ అస్సలు బాధపడాల్సిన అవసరం లేదంటున్న పండితులు..ఆ రోజు ఇంటికి వచ్చిన ముత్తైదువుకు బొట్టుపెట్టి పంపించాలని చెబుతున్నారు.

  • ఏదైనా పూజ, వ్రతం చేస్తున్నప్పుడు కుంకుమ, పసుపు చేజారి పడినా అతి ఎంతమాత్రం అపశకునం కాదు

  • వాస్తవానికి కుంకుమ కిందపడడం అంటే భూదేవికి బొట్టుపెట్టాం అనేందుకు సంకేతం...అంటే మన అమ్మకు మనం బొట్టుపెట్టాం అన్నమాట


Also Read: విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకుంటే ఈ అమ్మవారిని ప్రార్థిస్తే దొరుకుతాయట
మహిళలు బొట్టు పెట్టుకునే సమయంలో 
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే 
అని జగన్మాతను స్మరించుకుంటూ బొట్టు పెట్టుకోవాలి. 


ఏ వేలితో  బొట్టు పెట్టుకోవాలి



  • ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి

  • మధ్య వేలితో బొట్టుపెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుంది

  • బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది

  • చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు


Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం
బొట్టు నుదుటనే ఎందుకు పెట్టుకోవాలి
నుదిటి  భాగాన్ని బ్రహ్మ స్థానంగా భావిస్తారు. నుదుటి భాగం జ్ఞాపకశక్తికి , ఆలోచనా శక్తికి స్థానం. అందుకే నుదుటి మధ్య బొట్టు పెడతారు. కనుబొమ్మల మధ్య ఉన్న సూక్ష్మస్థానం విద్యుద్ అయస్కాంత తరంగ రూపాల్లో శక్తిని వెలువరిస్తుంది. కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే కాదు పురుషులకు కూడా. బొట్టుపెట్టుకోవడం మూఢాచారం కాదు. పెద్దలు మనకోసం పెట్టిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. 


ఏంకాదులే అని, భూదేవికి బొట్టు పెట్టినట్టు ఉంటుందని చీటికి మాటికి కావాలని కింద పడేయడం కూడా మంచిది కాదు. కేవలం పొరపాటున కిందపడినప్పుడు మాత్రం అదో అపశకునంగా భావించి ఏదో జరిగిపోతుందనే అపోహవద్దని చెప్పడం మాత్రమే మా ప్రయత్నం....


Also Read: మీరు తినే ఆహారంపైనా నవగ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసా