చాలామంది హడావుడిగా మంచంపై కూర్చుని భోజనం చేస్తుంటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ మంచంపై కూర్చుని భోజనం చేస్తే తిన్న ఆహారం ఒంటికి పట్టదు..మంచం కొళ్లకు పడుతుందని పెద్దలు అంటారు. అర్థం కావడం కోసం అలా చెబుతారు కానీ వాస్తవానికి మంచంపై, సోఫాపై కూర్చుని భోజనం చేయడం రోగాలకు హేతువు అని చెబుతారు. అలా చేస్తే భార్య, భర్త మధ్య గొడవలు, కుటుంబంలో మనశ్సాంతి ఉండకపోవడంతో పాటూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయట. ఏ పని చేసినా విజయం దరిచేరదని కూడా అంటారు. అందుకే భోజనం చేసేటపుడు భగవంతుడిని ప్రార్థించాలి.ఎందుకంటే దేహమే దేవాయం, ఆత్మ భగవంతుడు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ దేహానికి శాంతి చేకూరాలంటే ఓ పద్దతిగా భోజనం చేయాలి. 

Also Read: ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…యోగశాస్త్రం ఏం చెబుతోంది….పురాణాలు ఏం చెబుతున్నాయి..ఇంట్లో పాటించాల్సిన మరికొన్ని విషయాలు

  • రాత్రిపూట బాత్రూమ్ బకెట్‌లో నీటిని ఉంచడం వల్ల  ఇంట్లో ప్రతికూల శక్తి రాకుండా అడ్డుకుంటుంది
  • వంటగదిలో బకెట్ నిండా నీళ్లు పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
  • వాస్తు ప్రకారం,సూర్యాస్తమయం తర్వాత పెరుగు, పాలు, ఉప్పు దానం చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి.
  • రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా షింకులో ఎంగిలి పాత్రలు ఉంచకూడదు.అలాచేస్తే సంపద తగ్గిపోతుందని చెబుతారు
  • తూర్పు దిక్కుకి తిరిగి చేయటంవల్ల ఆయుష్షు పెరుగుతుంది
  • ఉత్తరంవైపు తిరిగి భోజనము చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి
  • పడమర, దక్షిణంవైపు తిరిగి భోజనం చెయ్యకూడదని పురాణాల్లో ఉంది

Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

భోజనానికి ముందు పఠించాల్సిన శ్లోకం"అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభేజ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరిఅన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరఃఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే"

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ| ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ! 

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే| జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ! 

భోజనం తర్వాత పఠించాల్సిన శ్లోకంఅగస్త్యం కుంభకర్ణంచ శమించ బడభానలనంఅహారపరిమాణార్దం స్మరమిచ వృకోదరం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నపానీయాలకు లోటులేకుండా ఉండాలంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం తప్పనిసరి. అందుకే నిత్యం భోజనం చేసేటప్పుడు అమ్మవారిని తలుచుకుని కృతజ్ఞతలు తెలిపి భోజనం చేయాలంటారు పండితులు. ఆకలితో ఉన్నవారికి, మూగజీవాలనకు అన్నప్రసాదాన్ని అందించేవారికి కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటుంది.

అందుకే పరబ్రహ్మ స్వరూపం అయిన అన్నాన్ని గౌరవించాలి. మంచంపై, సోఫాలపై కాకుండా ఓ పద్దతిగా భోజనం చేయాలి.

Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..