మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. ఇంటి నిర్మాణం ఆధారంగానే దశ తిరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే నిర్మాణం చేసేముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కూడా వాస్తు శాస్త్ర నిపుణులను పిలిచి మరీ సలహాలు స్వీకరిస్తారు. మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఈ నియమాలు పట్టించుకోనివారి సంగతి ఎందుకులెండి కానీ...పట్టించుకునే వారు మాత్రం ప్రతిచిన్న విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. అయితే భారీగా వాస్తు నియమాలు పాటించకపోయినా కనీసం పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం....
కనీసం పాటించాల్సిన వాస్తు నియమాలు
- సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవడం అస్సలు మంచిది కాదు. మీ ఇంటి ఫేసింగ్ ను బట్టి మెట్లు సింహద్వారానికి ఓ వైపుగా ఉండాలి కానీ ఎదురుగా మెట్లు కట్టకూడదు.
- ఈ శాన్యం వైపు ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్లు ఉండకూడదు
- మెట్లు తూర్పు నుంచి పడమరకు కానీ, ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు కానీ ఎక్కేవిధంగా ఉండాలి. మెట్లు బేసిసంఖ్యలో ఉండాలి, కుడిపాదం పెట్టి ఎక్కడం మొదలు పెడితే మీ ఫ్లోర్ కి చేరుకునేటప్పుడు మొదట కుడిపాదమే పెడతారు.
- సింహద్వారానికి ఉన్న తలుపు కుడివైపు తెరుచుకోవాలి. కొన్ని ఇళ్లకు తలుపు ఎడమవైపు తెరుచుకుని ఉంటుంది. కానీ ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే మంచిది అంటారు వాస్తు నిపుణులు.
- రూమ్ సీలింగ్ అందంగా ఉంజాలనే ఉద్దేశంతో రకరకాలుగా డిజైన్ చేస్తారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఐదు కార్నర్ లు ఉండడం మంచిది కాదని చెబుతారు.
- ఇంటికి వచ్చిన గెస్టులకు వాయువ్యం వైపు ఉన్న రూమ్ ని కేటాయించాలి
- ఆగ్రేనయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ బెడ్ రూమ్ ఏర్పాటు చేసుకోకూడదు. అలా చేస్తే నిప్పులపై పడుకున్నట్టే. పైగా ఆ ఇంట దంపతుల మధ్య సఖ్యత ఉండదని చెబుతారు.
- రెండు ద్వారాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు రెండూ సమానంగా ఉండేలా ఉండాలి.
- ఇంటికి ఉత్తరం, తూర్పు మూతపడకుండా చూసుకోవడం మంచిది.
- కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి
- కొన్ని ఇళ్లు అందంకోసం, స్థలం సరిపకడ రకరకాల షేపుల్లో నిర్మిస్తారు. అయితే తిక్రోణం, యూ ఆకారంలో ఇల్లు నిర్మించడం ఎంతమాత్రం కలసిరాదు
వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి
Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి