Spirituality: దేవాలయం పవిత్రమైన స్థలం. ఆలయంలోకి అడుగుపెట్టగానే బాధలన్నీ మరచిపోయి ఆ దేవుని సన్నిధిలో తన్మయత్వం పొందుతారు భక్తులు. ఎందుకంటే శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయంలో ఓ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుంటాయి. అందుకే ఆలయం లోపల మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల కూడా అంతా పవిత్రంగా ఉండాలంటారు. అలాంటిది ఆలయం లోపలకు వెళుతున్నారంటే ఇంకెన్ని పద్ధతులు, నియమాలు పాటించాలో తెలుసా..
దేవాలయానికి వెళ్లేవారు పాటించాల్సిన పద్ధతులు
- దేవాలయం అంటే దేవుడు కొలువైన స్థలం..పవిత్రమైన ప్రదేశం.. అలాంటి ప్రదేశానికి వెళ్లే భక్తులు కొన్ని పద్ధతులు
- పాటించాలి..అప్పుడే దైవం అనుగ్రహానికి పాత్రులవుతారు
- గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, నుదుటన కుంకుమ ధరించాలి
- సంప్రదాయ వస్త్రాలతోనే దేవుడిని దర్శించుకోవాలి
- పెద్దవారి దగ్గరికి, పిల్లల దగ్గరకు, దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదు..అందుకే పళ్లు, పూలు తీసుకుని వెళ్లాలి.. గీతలో కృష్ణ పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి" ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.
- గుడికి చేరుకోగానే కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
- ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి
- లోపలకు అడుగుపెట్టాక మనసులో భగవంతుడి ధ్యానం తప్ప..మరో ఆలోచన ఉండకూడదు
- ప్రదిక్షిణ చేసిన తర్వాత మొదట మూల విగ్రహం పాదాలను దర్శించుకుని ఆ తర్వాత స్వామివారి రూపం మొత్తాన్ని చూడాలి
- అర్చన చేయించుకునేవారు గోత్రం, ఇంటిపేరు నక్షత్రం చెప్పుకోవాలి.
- దర్శనం అయి తీర్థం తీసుకున్నతర్వాత కాసేపు స్వామి అమ్మవారి సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలి
- ప్రసాదం తీసుకుని బయటకు వెళ్లేముందు మరోసారి దేవుడిని దర్శించుకుని..గోపురానికి నమస్కరించి బయటకు రావాలి
- ఆలయంలో అనవసరంగా మాట్లాడటం, పరుషపదజాలం ఉపయోగించడం చేయరాదు
- ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గోక్కోవడం, తాంబూలం వేసుకోవడం చేయరాదు
- జనన, మరణానికి సంబంధించిన విషయాలు గుడిలో మాట్లాడకూడదు
- ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు
- నందీశ్వరుడు, శివలింగానికి మధ్యనుంచి నడిచి వెళ్ళకూడదు
- ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు, బలిపీఠానికి మొక్కకూడదు
- మూలవిరాట్ దగ్గర దీపం లేకుండా దర్శనం చేసుకోరాదు
- ఆలయంలో ప్రవర్తనా విధానం ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు
- ఆలయానికి వెళ్లి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు..కాసేపు కూర్చున్నాక కడుక్కోవచ్చు
Also Read: సంక్రాంతినే పెద్దపండుగ, పెద్దలపండుగ అంటారెందుకు, దీని విశిష్టత ఏంటి!
ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయ బద్ధంగా ఆలయాన్ని నిర్మిస్తారు. బీజాక్షరాలతో కూడిన దేవతా యంత్రాన్ని, అత్యంత పవిత్రమైన విగ్రహాన్ని గుళ్లో ప్రతిష్ఠిస్తారు. ఆలయాల్లో నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అందుకే ఆలయాలకు వెళ్లేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
Also Read: ఈ సంక్రాంతికి ఈ ఐదుపనులు చేసేలా ప్లాన్ చేసుకోండి!