జానకి గోవిందరాజులకి సాయం చేయబోతుంటే జ్ఞానంబ వద్దని తన చెయ్యి పక్కకి తోసేస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఎటువంటి పనులు కూడా జానకిని జ్ఞానంబ చేయనివ్వదు. ఇదే సందు అనుకుని మల్లిక సేవలు చేస్తాను అంటే వద్దని అంటాడు గోవిందరాజులు. నువ్వు చేతికి నూనె రాస్తే రక్తప్రసరణ ఆగిపోయి మంచానికే పరిమితం అయిపోతాను అని గోవిందరాజులు అనేసరికి చికిత కూడా కౌంటర్ వేస్తుంది. ఇదంతా జానకి వల్లే జరిగిందని మల్లిక తనని మాటలతో వేధిస్తుంది. జ్ఞానంబ వంట చేసుకుంటూ ఉండగా మల్లిక వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇదే టైమ్ ఆమెకి దగ్గర అయి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ప్లాన్ వేస్తుంది. కానీ జ్ఞానంబ మాత్రం తనకి ఏ సహాయం అవసరం లేదు వెళ్లిపొమ్మని చెప్తుంది.


Also Read: 'ఐ లవ్యూ శ్రీవారు' అని ప్రేమలేఖ రాసిన వేద- యష్ తనని భార్యగా అంగీకరిస్తాడా?


గోవిందరాజులకి దగ్గు రావడంతో పక్కనే ఉన్న గ్లాసు అందుకోబోయి కిందపడబోతుంటే రామా సమయానికి వచ్చి పట్టుకుని నీళ్ళు తాగిస్తాడు. జానకి అది చూసి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి వెంటనే జ్ఞానంబ పరుగు పరుగున వస్తుంది. నీళ్ళ కోసం గ్లాసు అందుకోబోయి కింద పడబోయారు సమయానికి ఆయన వచ్చి పట్టుకున్నారని జానకి చెప్తుంది. ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని రామా తండ్రి కోసం వీల్ చైర్ తీసుకుని వస్తాడు. అది చూసి జ్ఞానంబ గుండె పగిలిపోతుంది. కోపంగా ఇవన్నీ ఎందుకని అంటుంది. కిందపడే పరిస్థితి మళ్ళీ రాకూడదని తెచ్చానని చెప్తాడు. మంచి పనే చేశావ్ ఈ వయసులో ఇవ్వాల్సిన బహుమతి ఇచ్చావ్ అని జ్ఞానంబ కోపంగా అంటుంది.


రామా: ఇలా నన్ను ద్వేషిస్తుంటే భరించలేకపోతున్న అమ్మా దయచేసి నన్ను క్షమించు


జ్ఞానంబ: నువ్వు నీ తమ్ముడి కోసం అప్పు చేసి ఉండవచ్చు, స్నేహితుడికి ఇచ్చి తప్పు చేసి ఉండొచ్చు. కానీ నాకు చెప్పకుండా మోసం చేశావ్. నువ్వు అడిగినంత తేలిక కాదు నిన్ను క్షమించడం అనేసరికి రామా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


Also Read: బెనర్జీతో చేతులు కలిపిన లాస్య- కళ్ళు తిరిగి పడిపోయిన తులసి, పరిస్థితి విషమం


మల్లిక తన కోరిక నెరవేరబోతుందని చంకలు గుద్దుకుంటూ నీలావతికి ఫోన్ చేస్తుంది. రామా చేసిన అప్పు అడ్డంపెట్టుకుని బయటకి వెళ్లిపోతాను, మంచి ఇల్లు చూడమని మల్లిక చెప్తుంది. తనకి ఎలాంటి ఇల్లు కావాలో చెప్పమని అంటుంది. దీంతో మల్లిక తన ప్లాన్ చెప్తుంది. అప్పు ఎలా తీర్చాలి అని జానకి, రామా ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద మొత్తంలో డబ్బులు అనేసరికి ఎవరూ ఇవ్వడం లేదని రామా దిగులుగా చెప్తాడు. చరణ్ మీద పోలీస్ కంప్లైంట్ పెడతానని రామా అంటాడు. కానీ ఎటువంటి సాక్ష్యం లేదు కదా ఏమని కేసు పెడతామని జానకి అంటుంది. వడ్డీ వ్యాపారి కూడా పీకల మీద కూర్చున్నాడని రామా అంటాడు. మనం కుటుంబం మీద అభిమానం ఉన్న భాస్కర్ మూడు రోజుల గడువు లోగా డబ్బుల అప్పు తీర్చమని అడుగుతున్నాడంటే దాని వెనుక బలమైన కారణం ఏదో ఉండి ఉంటుందని జానకి అనుమానపడుతుంది. వడ్డీ వ్యాపారి జ్ఞానంబ ఇంటి కాగితాలు సునంద కొడుకు కన్నబాబు చేతిలో పెడతాడు.