మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నిత్యం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. మొండి అనారోగ్యాలకు మందులు పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. అలా ఇప్పుడు వారు మహమ్మారి అయినా క్యాన్సర్ కు టీకా కనుక్కొనే పనిలో చాలా ఏళ్లుగా శ్రమ పడుతున్నారు. క్యాన్సర్ ప్రపంచంలోని ఎన్నో దేశాలను పట్టిపీడిస్తోంది. రకరకాల అవయవాలకు క్యాన్సర్ వస్తూ ఎంతో మంది ప్రాణాలను తీసేస్తోంది. అందుకే ఆ మహమ్మారికి టీకా కనుక్కోవాలని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఆ ఎదురు చూపులకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో ఏటా ఎంతోమంది క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు. క్యాన్సర్లలో 200 రకాలు ఉన్నాయి. గాలి కాలుష్యం వల్ల కూడా క్యాన్సర్ సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సిగరెట్ తాగే అలవాటు లేని వాళ్ళలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి మరణించడం వారిని ఆశ్చర్యపరిచింది. పరిశోధనలో గాలి కాలుష్యం కారణంగా వారికి క్యాన్సర్ సోకినట్టు నిర్ధారణ అయింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పద్ధతి 18 లక్షల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ తో చనిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. వీరిలో ఎక్కువమంది పొగతాగే అలవాటు ఉన్నవారే. అయితే పొగ తాగని వారు కూడా మరణించడమే బాధ పెట్టే అంశం. మనదేశంలో కూడా గాలి కాలుష్యం వల్ల 16 లక్షల మంది చనిపోయినట్టు ఒక రిపోర్ట్ చెబుతోంది. కాబట్టి క్యాన్సర్ ఎప్పుడు ఎలా సోకుతుందో చెప్పడం కష్టమే. గాలి కాలుష్యాన్ని కూడా తట్టుకునే విధంగా మాస్కులు ధరించడం అవసరం. ప్రపంచంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉండగా భారతదేశం మూడో స్థానంలో ఉంది. మన దేశంలో ప్రతి ఏడాది పది లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి.  అయితే ఈ కేసుల్లో 70 శాతం మంది మహిళలే ఉంటున్నారు. ఇక క్యాన్సర్ కారణంగా మన దేశంలో ప్రతి ఏడాది ఐదు లక్షల మంది చనిపోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.


క్యాన్సర్ అంటే...
మన శరీరంలో ఎక్కడైనా కూడా క్యాన్సిర్ కణితులు పెరగొచ్చు. కణాలు పాతబడిన లేదా దెబ్బతిన్నా అవి చనిపోయి కొత్త కణాలు పుడతాయి. కానీ కొన్నిసార్లు అలా జరగదు, దెబ్బతిన్న కణాలే పెరుగుతూ కణితుల్లా మారిపోతాయి. అవి గడ్డలుగా తయారవుతాయి. వీటిని క్యాన్సర్ అంటారు. ఈ కాన్సర్ కణితులు ఒకచోట నుంచి పక్క అవయవాలకు కూడా సోకుతాయి. అందుకే వెంటనే చికిత్స తీసుకోవడం అవసరం. అలాగే కొన్ని క్యాన్సర్లు వారసత్వంగా కూడా వస్తాయి.


క్యాన్సర్ టీకా వస్తోంది
చాలా రోగాలకు టీకాలు ఉన్నట్టే క్యాన్సర్ కు టీకా కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది ఫ్లూ, పోలియోలాగా పూర్తిగా నివారించదు. కానీ మళ్ళీ తిరగబెట్టకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ టీకా పేరు ఎంఆర్ఎన్ఎ. దీన్ని చర్మ క్యాన్సర్ పై ఇప్పటికే పరిశోధన చేసి చూశారు. తిరిగి వచ్చే అవకాశం, దానివల్ల మరణించే అవకాశం 44% తగ్గుతున్నట్టు అధ్యయనంలో బయటపడింది. దీంతో ఇది మిగతా క్యాన్సర్లకు కూడా ఇదే విధంగా సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశిస్తున్నారు. మిగతా ప్రాణాంతక కాన్సర్లపై ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది. వాటిపై కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తే క్యాన్సర్ చికిత్సలో ఇది ఒక విప్లవాత్మక మార్పు అని భావించవచ్చు


ఇప్పటికే ఆ టీకా
ప్రపంచంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. దీన్నే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ కు మనదేశంలోనే తొలిసారిగా టీకాను తయారు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జితేంద్ర సింహ ఈ క్యాన్సర్‌ను లాంచ్ చేశారు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిసి ఈ టీకాను అభివృద్ధి చేశాయి.  దీన్ని తొమ్మిది నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు ఇవ్వనున్నారు.  త్వరలోనే దేశం అంతా ఈ టీకా పంపిణీ జరిగే అవకాశం ఉంది. 


Also read: మనిషికి మాత్రమే గుండె పోటు ఎందుకు వస్తుంది? మిగతా జీవులకు ఎందుకు రాదు?