సృష్టిలో ఏ పని చేసినా దానిపై కర్మ ఆధార పడి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. మన కర్మ ప్రకారమే ఎప్పటికైనా మరణం వస్తుంది. కానీ మనకు మరణం వచ్చే ముందు పలు సంకేతాలు, సూచనలు కనిపిస్తాయట. ఈ సంకేతాలు కనిపిస్తే మరణం తథ్యం అని శివపురాణం చెబుతోంది. శివపురాణం ప్రకారం, పార్వతి దేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది.. “స్వామి..! మరణానికి సంకేతం ఏంటి, మరణం రాబోతోందని ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది.
శివుడు పార్వతికి చెప్పిన మరణ సంకేతాలు
- ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు, కొద్దిగా ఎరుపు రంగులో మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలలో చనిపోవచ్చని అర్ధం
- నీరు, నూనె , అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి 6 నెలల్లో చనిపోతాడు. ఈ సమయం కన్నా ఒక నెల ఎక్కువ జీవిస్తే తమ నీడను తాము చూసుకోలేరు..ఒకవేళ కనిపించినా ఆ నీడకు తలభాగం ఉండదు
- ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరోలనే లోకాన్ని వీడిబోతున్నాడని అర్థం
- వారం రోజుల పాటు ఎడమ చేయి మెలితిరిగిపోతున్నట్లు అనిపిస్తున్నా కూడా త్వరలో మరణం తథ్యం అని అర్థం
- నోరు, నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో ప్రాణం కోల్పోతాడు
- చంద్రుడు, సూర్యుడు , అగ్ని కాంతిని చూడలేనప్పుడు ఇక జీవించేది ఆరు నెలలే
- నాలుక అకస్మాత్తుగా ఉబ్బి, దంతాల్లో చీము వస్తే ఆరు నెలలకు మించి బతకరు
- సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఎరుపు రంగులోనే కనిపించినా మరణ సమీపించినట్టే
- గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు, ఏదైనా గ్రామాన్ని ఖాళీగా కానీ ధ్వంసం చేసినట్టు కానీ కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్టే
- పావురం, కాకి, గద్ద తలపై కూర్చున్నా, వాలినా మరణ సంకేతమే
- చనిపోయే ముందురోజు పార్వతీ పరమేశ్వర్లు కలలో పరామర్శిస్తారట
- మరణానికి ముందురోజు యమభటులు కల్లో కనిపించి పేరు అడుగుతారు
- రెండు పిచ్చుకలు నీళ్లలో మునగితేలినా మీ ప్రాణం గాల్లో కలిపోతుందని సంకేతమే
- తీతువు పిట్ట ఇంటిపైనుంచి వెళ్లినా మరణానికి చేరువలో ఉన్నామన్న సంకేతమేనట
ఇవి శివపురాణంలో ప్రస్తావించినవి మాత్రమే. వీటిని పూర్తిగా అన్వయించుకుని లేనిపోని భయాలు క్రియేట్ చేసుకోవద్దు. పురాణాల్లో ప్రస్తావించిన కొన్ని విషయాలు తెలుసుకునే ఆసక్తి చాలామందికి ఉంటుంది..వారి కోసమే ఈ కథనం. ఇహ లోకంలో మీరు చేసే పాపపుణ్యాలను బట్టి మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, గమ్యం ఉంటుంది.
Also Read: అత్యాచారం చేసిన వాళ్లకి గరుడపురాణంలో శిక్షలివే
Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!
Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?