మానవ మృగాలు అనే పదం వినియోగిస్తాం కానీ మృగం కూడా తలదించుకునే లాంటి ఘటనలు జరుగుతున్నాయ్. ఎందుకంటే మృగానికి ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది, మిగిలిన విషయాల్లోనూ ఓ పరిమితి ఉంటుంది కానీ మనిషి ఆ పరిధి, పరిమితి దాటిపోయాడు.అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార ఘటన చూస్తే ఇలాగే అనిపిస్తోంది. కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న కుమార్తెను కళ్లముందే లైంగికంగా వేధించడం చూసిన ఆ తల్లిదండ్రుల పరిస్థితేంటి?. మానసిక వికలాంగురాలు అంటే పసిపిల్లతో సమానం..అలాంటి మహిళని లైంగికంగా వేధిస్తే ఆమె ఎవరికి చెప్పుకోగలదు? ఇలాంటి రాక్షసులను శిక్షించేదెవరు?
ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా, కఠిన శిక్షలు విధించినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇలాంటి వారిని చట్టాలు వదిలిపెట్టినా పైవాడు వదిలేదే లే. లైంగిక వేధింపులకు పాల్పడే వారికి గరుడ పురాణం ప్రకారం దారుణమైన శిక్షలున్నాయి.
Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!
పుయోదకం
పురుషులు లేదా మహిళలు ఎవరైనా..ఎవర్నైనా అత్యాచారం చేసినా, లైంగికంగా వేధించినా నరకంలో విధించే శిక్ష ఇది. ఒక పెద్ద బావిలో మలం, మూత్రం, రక్తం, శ్లేష్మం నింపి అందులో ఆ వ్యక్తులను పడేస్తారు. వాళ్లు ఎప్పటికీ ఆ బావిలోనే ఉండిపోవడమే.
సల్మలి
వివాహేతర సంబంధాలు పెట్టుకునే స్త్రీ, పురుషులకు నరకంలో యమ భటులు విధించే శిక్ష సల్మలి. బాగా వేడి చేసిన ఓ ఇనుప స్తంభాన్ని నగ్నంగా కౌగిలించుకోమని చెప్పి యమభటులు కొరడాలతో కొడుతుంటారు.
వజ్రకంఠకసలి
లైంగిక వాంఛ తీర్చుకునేందుకు జంతువులను కూడా వదలని దుర్మార్గులన్నారు. ఇలాంటి వ్యక్తులకు నరకంలో విధించే శిక్ష వజ్రకంఠసలి. సూదుల్లాంటి పెద్ద పెద్ద లోహాలను శరీరంలోకి గుచ్చి వారిని గాలిలో వేలాడదీసి శరీరాన్ని ఛిద్రం చేస్తారు.
లలాభక్షం
స్త్రీలను కామంతో చూసే వారికి నరకంలో విధించే శిక్ష లలాభక్షం. కుళ్లిపోయిన వీర్యంతో నిండిన సముద్రంలో పాపులను పడేసి ఎప్పటికీ అందులోనే ఉంచుతారు.
అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. ఇందులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడుడికి చెప్పిన విషయాలను వేద వ్యాసుడు రచించాడు. మనిషి మరణం అనంతరం ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది...ఎక్కడికి వెళుతుంది, పుణ్యాలు చేస్తే స్వర్గానికి, పాపాలు చేస్తే నరకానికి వెళతారని చెబుతూనే అక్కడ విధించే శిక్షల గురించి వివరంగా గరుడ పురాణంలో ప్రస్తావించారు.
Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?