Krishna Ashtakam Telugu: దేవుళ్లంతా... శ్రీ విష్ణువు అవతారాలు, యోగులు, మహర్షులు అందరూ ఉత్తరాయణంలోనే జన్మించారు. అందుకే ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు. దక్షిణాయనం చీకటికి ప్రతీక..దక్షిణాయణం కర్మకి ఆధారం. పైగా శ్రావణమాసం వర్ష రుతువు అంటే వెన్నెల ఉండదు. వర్ష రుతువులో శుక్ల పక్షం-కృష్ణ పక్షంలో కృష్ణ పక్షం పూర్తి చీకటిగా ఉంటుంది. ఇలాంటి చీకట్లో అర్థరాత్రి చెరశాలలో జన్మించాడు శ్రీకృష్ణుడు. మనిషి ఎక్కడ ఉండకూడదో అక్కడ పుట్టాడు. అందుకే దక్షిణాయణం-కృష్ణపక్షంలో చిమ్మ చీకటి మధ్య జన్మించిన కృష్ణుడుని..మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు నడిపించాలని పూజిస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ రాక్షసులను సంహరించడంతో ముగిసిపోతాయి. కానీ రామ, కృష్ణావతారాలు మాత్రం పరిపూర్ణ అవతారాలు. పైగా ఏ అవతారంలోనూ తానే దేవుడిని అని చెప్పలేదు...కానీ కృష్ణావతారంలో తానే దేవుడిని అని స్పష్టంగా చెప్పాడు కృష్ణపరమాత్ముడు. ఎక్కువ మంది కృష్ణుడిని భగవత్ స్వరూపంగా కన్నా గురువుగా భావిస్తారు. గురువు అంటే చీకటి లోంచి వెలుగులోకి, అజ్ఞానం లోంచి జ్ఞానంవైపు నడిపించే మార్గదర్శి.  గురు స్వరూపుడైన పరమాత్ముడిని కృష్ణాష్టకంతో ప్రార్ధిస్తే...జ్ఞానం సిద్ధిస్తుంది, పిల్లలకి దుష్ట శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుందని చెబుతారు. ఇంకెందుకు ఆలస్యం..ఈ అష్టకాన్ని మీ పిల్లలకు నేర్పించండి...


Also Read: హమ్మయ్య ఈ ఉగాదితో ఈ రాశివారికి 'శని' వదిలిపోయింది, ఇక మంచిరోజులు మొదలైనట్టే!


శ్రీ కృష్ణాష్టకం


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 1


అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 2


కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥ 3


మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 4


ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 5


రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 6


గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 7


శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 8


కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ 9


ఇతి శ్రీ కృష్ణాష్టకం సంపూర్ణం . 


సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు !!
శుభం భవతు !!


Also Read: ఉత్సాహం, ధైర్యం, ఆదాయం, అభివృద్ధి - ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మామూలుగా లేదు!


పరీక్షలు దగ్గరకొచ్చాయి..పిల్లల్లో టెన్షన్ పెరిగిపోతుంది..ఆ టెన్షన్ వల్ల అటెన్షన్ కోల్పోతారు. ఇలాంటి సమయంలో వారిని ప్రశాంతంగా ఉంటేందుకు ఆధ్యాత్మిక సాధన అవసరం. ఈ సమయంలో నిత్యం పిల్లలు ఈ శ్లోకం చదువుకుంటే మంచి జరుగుతుందని పండితులు చెబుతారు. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...