కొందరు ప్లేట్ నిండా వడ్డించుకుని కడుపునిండా తింటూనే ఆ భోజనంపై చిరాకుపడుతుంటారు, బాగాలేదంటూ విమర్శిస్తారు. వాస్తవానికి భోజనం చేసేటప్పుడు  వంట బాగా లేదని కోపగించుకోవడం, కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టడం వంటివి  అస్సలు చేయకూడదు. ఇంకా నియమాలేంటంటే... 



  • రోజుకి రెండుసార్లు భోజనం చేయాలని తైత్తరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది 

  • రెండుసార్ల మధ్యలో ఇంకేమీ తినకుండా ఉంటే ఉపవాస ఫలితం కూడా వస్తుందట

  • భోజనం చేసేటప్పుడు తూర్పువైపు తిరిగి భోజనం చేయాలి

  • తూర్పువైపు తిరిగి భోజనం చేస్తే ఆయుష్షు

  • దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే కీర్తి

  • ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి

  • పడమర, దక్షిణం వైపు తిరిగి భోజనం చేయరాదని వామనపురాణం, విష్ణుపురాణంలో ఉంది

  • తూర్పు తిరిగి భోజనం చేయడం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా చెబుతున్నాయి

  • మను సంహిత ప్రకారం కుటుంబ పెద్ద తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేయాలి

  • భోజనానికి ముందు,తర్వాత  కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

  • అన్నం తినే కంచాన్ని ఎడమ చేతితో ముట్టుకోకూడదు. ఒకవేళ పొరపాటునా ముట్టుకుంటే,  వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.

  • అన్నం తింటున్న సమయంలో ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు.

  • అన్నం తినే సమయంలో ధ్యాస మొత్తం భోజనం మీదే ఉండాలి తప్ప వేరే విషయాలను ఆలోచించకూడదు. మనస్సును  నిర్మలంగా ఉంచుకోవాలి.

  • భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాల్లో వెంట్రుకలు, పురుగులు వస్తే వెంటనే తినే దాన్ని  విడిచిపెట్టాలి

  • కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు.

  • భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

  • స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమం

  • పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం

  • అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

  • ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.

  • ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు,వడ్డించరాదు.


Also Read:  దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే


Also Read: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే