నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పినాఅయిదో దిక్కొకటున్నది.. పైనా..!అది చూస్తున్నది నువ్వేమి చేసినా..!!పంచభూతాల సాక్షిగా...పంచభూతేషు(పరమేశ్వరుడు) సాక్షిగాపాఠం చెబుతది పాపం పండిన రోజున

ఇది ఓ సినిమాలో పాట. కానీ ఆలోచిస్తే ఇందులో ప్రతి మాటా నిజమే కదా అనిపిస్తుంది. చుట్టూ ఎవరూ లేరు, నన్ను ఎవ్వరూ చూడడం లేదు నేను ఏమైనా చేయొచ్చనుకుంటే పొరపాటే. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి .

ఇవే ఆ 18 సాక్షులునాలుగు వేదాలు ( సామవేదం, ‎ఋగ్వేదం , ‎అథర్వణ వేదం, ‎యజుర్వేదం)పంచభూతాలు ( భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం)అంతరాత్మధర్మంయముడుఉభయ సంధ్యలు ( సూర్యోదయం, సూర్యాస్తమయం)సూర్య చంద్రులుపగలు, రాత్రి

Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందేవీటిని అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఏ న్యాయస్థానంలోనూ సాక్ష్యం చెప్పకపోవచ్చు కానీ వీటినుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి న్యాయదేవతను మోసం చేయొచ్చు కానీ వీటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కానేకాదు. ఇది గుర్తించలేక, ఇవన్నీ జడపదార్థాలే కదా అనే భ్రమలో ఉంటున్నారు. కానీ మన ప్రతి చర్యని అవి నమోదు చేస్తుంటాయని, నిత్యం మన నివేదికల్ని విధికి చేరుస్తాయి..అవే కర్మలుగా మారతాయని గుర్తించలేకపోతున్నాం. 

సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!  అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే! అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!! 

Also Read: శివరాత్రి గురించి పార్వతికి శంకరుడు చెప్పిన కథ ఇదేమనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. వాటికి తగ్గట్టే కర్మ ఫలం ఉంటుంది. గత జన్మలో పాప పుణ్యాలు ఈ జన్మలో, ఈ జన్మలో చేసే పాప పుణ్యాలు వచ్చే జన్మలో అమలవుతాయనే భ్రమలో ఉండాల్సిన అవసరం లేదు..కలియుగంలో  ఈ జన్మలో చేసే పాప పుణ్యాలు వెంటనే ఫలితం  చూపించేస్తున్నాయ్. జరిమానాలు అమలైపోతున్నాయ్. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామక్రమం. 

అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి ఒక్కరికీ తెలుసు . అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను పక్కన పెట్టడమే ఎన్నో అనర్థాలకు కారణం అవుతోంది. నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .ఈ స్పృహ మీలో ఉన్నప్పుడు తప్పొప్పులు ఏం చేసినా అందుకు తగిన ఫలితం పొందేందుకు సిద్ధంగా ఉండండి. మంచి చేసేందుకు ప్రయత్నించండి లేదా..మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి. 

"కోరి కొని తెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ"