ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు నీళ్లు తాగి వెళితే మంచిదంటారు కొందరు.. పంచదార కలుపుకుని పాలు తాగితే వెళ్లిన పని సక్సెస్ అవుతుందని మరికొందరు చెబుతారు. స్వీట్ తినమని ఇంకొందరు చెబుతారు. అక్కడితే అయిపోలేదు...వేసుకునే డ్రెస్సు నుంచి బయట అడుగుపెట్టేటప్పుడు ఎదురయ్యే శకునం వరకూ ప్రతిదీ సెంటిమెంంటే. ఇప్పటి తరం సంగతేమో కానీ అప్పట్లో కొన్ని చిన్న చిన్న పద్ధతులు ఫాలో అయ్యేవారు. ఇంట్లోంచి బయలుదేరేముందు ఆ రోజు వారాన్ని బట్టి కొన్ని అనుసరించేవారు..అవేంటంటే...
- సోమవారం పనిపై బయటకు వెళ్లేటప్పుడు అద్దంలో ఓసారి ముఖాన్ని చూసుకుని వెళితే ఆ పని సక్సెస్ అవుతుంది
- మంగళవారం పనిపై బయటకు వెళ్లేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళితే విజయం మీదే
- బుధవారం ధనియాలు నోట్లో వేసుకుని బయట అడుగుపెడితే తలపెట్టిన పని పూర్తవుతుంది
- గురువారం జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ వెళితే అనుకున్న పని అనుకున్నట్టు పూర్తవుతుంది
- శుక్రవారం బయటకు వెళ్లేటప్పుడు పెరుగు-పంచదార కలపి తీసుకుంటే ఎంత కష్టమైన పని అయినా సులభంగా పూర్తవుతుందట
- శనివారం అల్లం ముక్క నోట్లో వేసుకుని వెళితే శుభం జరుగుతుందట
- ఆదివారం కిళ్లీ కానీ, తమలపాకు కానీ వేసుకుని బయటకు వెళితే ప్లాన్ ప్రకారం పనిపూర్తవుతుందని చెబుతారు
నోట్: కొన్ని పుస్తకాల్లో చదివిన విషయాలు, పండితులు చెప్పినవి ఫాలో అయి రాసిన కథనం ఇది.వీటిని ఎంతవరకూ విశ్వశించాలి, అసలు విశ్వశించాలా వద్దా, ఫాలో అవ్వాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...
Also Read: ఏప్రిల్ 30న శనివారం, అమావాస్య, సూర్యగ్రహణం-ఆ రోజున ఇలా చేయండి
ప్రయాణ సమయంలో పఠించాల్సిన శ్లోకాలు
1.శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
2.వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నన్దకీ|
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||
3."గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ"||
4. ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
5. "గౌరి వల్లభకామారే కాలకూట విషాదన
మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక"
6. "దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ
అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని"
7. "నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ
మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల"
Also Read: సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం, ఈ ప్రభావం మీ రాశిపై ఏమేరకు ఉందో తెలుసుకోండి
Also Read: హిందువులకు కార్తీకమాసం, ముస్లింలకు రంజాన్- ఈ రెండింటి మధ్య సారూప్యతలివే