Spirituality: ఏదైనా పనిని కొత్తగా ప్రారంభించినప్పుడు..ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు..రోజు, వారం, తిథి, నక్షత్రం ఇలా మంచిది చూసుకునేవారి సంఖ్య ఎక్కువే. ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. కొందరికి కొన్ని వారాలు అస్సలు కలసిరావని నమ్ముతారు.  మీరు కొన్ని నియమాలు పాటిస్తే ఏ రోజు ఏం తలపెట్టినా కలిసొస్తుందని అంటారు పెద్దలు.  ఏదైనా పనిపై బయటకు వెళ్లేటప్పుడు సాధారణంగా మంచి నీళ్లు తాగివెళతారు. దేవుడికి నమస్కరించి బయలుదేరుతారు మరికొందరు. పాలు - పంచదార కలిపి తాగిన తర్వాత స్టార్ట్ అవుతారు ఇంకొందరు. స్వీట్ తిని బయలుదేరితే వెళ్లిన కార్యం సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుందని నమ్ముతారు. మరికొందరు వేసుకునే డ్రెస్ కలర్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో భాగంగా వారంలో మీరు బయలుదేరే రోజును బట్టి ఇవి ఫాలో అయితే అంతా మంచే జరుగుతుందంటారు.  


Also Read: నక్షత్రం మారుతున్న శని..అక్టోబరు నుంచి మూడు నెలల పాటూ ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే!


సోమవారం 


ఈ రోజు ఏదైనా పనిపై ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు అద్దంలో ఓసారి మీ ముఖాన్ని చూసుకుని వెళితే...ఆ పని వందశాతం పూర్తవుతుంది. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించగల ధైర్యం మీకొస్తుందని చెబుతారు.


మంగళవారం


మంగళవారాన్ని కొందరు నెగిటివ్ గా భావిస్తారు కానీ మంగళం అంటే జయం..మంగళవారం అంటే జయవారం. ఈ రోజు ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతుందంటారు. అయితే మంగళవారం కొత్తగా ఏం చేసినా బయలుదేరి వెళ్లేముందు బెల్లం తిని వెళితే మంచి జరుగుతుంది


బుధవారం


బుధవారం విఘ్నాధిపతి వినాయకుడి రోజుగా భావిస్తారు. ఈ రోజు నూతన కార్యక్రమాలు తలపెట్టినా, ఏదైనా పనిపై బయలుదేరినా ధనియాలు నోట్లో వేసుకుని వెళితే వెళ్లిన పని అడ్డంకులు ఎదురైనా కానీ పూర్తవుతుంది


Also Read: శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఈ పూలతో పూజచేస్తే సిరిసంపదలు నిలుస్తాయి!


గురువారం


గురువారం రోజు సాయిబాబా సెంటిమెంట్ కొందరికి, సంతోషి మాత, అమ్మవారు సెంటిమెంట్ మరికొందరికి. ఈ రోజు ఏదైనా పనిపై బయటకు వెళ్లేముందు జీలకర్ర నోట్లో వేసుకుని వెళితే అనుకున్న పని అనుకున్నట్టు పూర్తవుతుంది. 


శుక్రవారం 


శుక్రవారం...శ్రీ మహాలక్ష్మికి అంకితం చేసిన రోజు. శుక్రవారాన్ని శుభవారంగా భావిస్తారు. నూతన కార్యక్రమాలు మొదలుపెట్టాలన్నా, నూతన వస్తువులు కొనుగోలు చేయాలన్నా, వాటిని ప్రారంభించాలన్నా శుక్రవారం మంచిదిగా భావిస్తారు. ఈ రోజు ఏదైనా పని తలపెడితే ఎంత కష్టమైనా కానీ పూర్తవుతుందని నమ్ముతారు. అయితే శుక్రవారం రోజు పెరుగు-పంచదార కలిపి తీసుకుని తిన్నాక బయలుదేరితే విజయం మీ సొంతం.


Also Read: శ్రావణమాసంలో ఈ రాశులవారిపై శివుడి అనుగ్రహం - సెప్టెంబరు 03 వరకూ మీకు తిరుగులేదు!


శనివారం


శనివారం...శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకింత చేసిన రోజు. శని బాధలు, గ్రహదోషాలు ఉన్నవారు శనివారం ఆంజనేయుడిని పూజిస్తారు. అయితే ఈ రోజు ఏ పని ప్రారంభించినా బయటకు వెళ్లేముందు చిన్న అల్లం నోట్లో వేసుకుని వెళితే శుభం జరుగుతుంది. 


ఆదివారం


సూర్య భగవానుడిని ఆరాధించే రోజు అయిన ఆదివారం కొత్తగా ఏమైనా పనులు ప్రారంభించాలి అనుకుంటే కళ్లీ కానీ, తమలపాకు కానీ వేసుకుని వెళితే అనుకున్న పనులు పూర్తవుతాయి. 


 
ప్రయాణ సమయంలో పఠించాల్సిన శ్లోకాలు


 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే


ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం


వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నన్దకీ
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు


 Also Read: మీ సమస్య ఆధారంగా వారంలో ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలి..దానివల్ల వచ్చే ఫలితమేంటి!