Bhavani Deeksha 2024:  కనక దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులతో పాటు  భవానీ దీక్షల విరమణకు వచ్చే స్వాములకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భవానీ దీక్షల విరమణకు వచ్చే వారి కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చారు.  ఇంద్రకీలాద్రిపై క్యూలైన్ల ప్రారంభం. వెయిటింగ్ హాళ్లు, పార్కింగ్ స్థలాలు, లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్లు, అన్నప్రసాదం పంపిణీ సహా సకల వివరాలు ఈ మొబైల్ యాప్ లో అందుబాటులో ఉంటాయి.  


Also Read: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!


'భవానీ దీక్ష 2024' పేరుతో ఈ ప్రత్యేక యాప్ ఉంటుంది
అన్ని యాప్స్ లానే మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి 'భవానీ దీక్ష 2024' యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి
రిజిస్టర్ పై క్లిక్ చేసి మీ ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ , రాష్ట్రం, ఆధార్ నంబర్, మీ అడ్రస్ సహా అక్కడ అడిగిన వివరాలు పూర్తిగా నమోదు చేసుకోండి
అప్పుడు మీ వాట్సాప్ లో  'శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం' పేరుతో గ్రూప్ క్రియేట్ అవుతుంది
ఫోన్లో డౌన్లోడ్ అయిన యాప్ ని క్లిక్ చేస్తే..రిజిస్టర్ ఫోన్ నంబరు నమోదు చేయండి..
వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే చాలు (OTP సాధారణ మెసెజ్ రూపంలో కాదు వాట్సాప్ లో ఉన్న  'శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం' గ్రూప్ లో వస్తుంది)
OTP ఎంటర్ చేసిన యాప్ ఓపెన్ అవుతుంది..అందులో మొత్తం 24 రకాలు సేవలు అందుబాటులో ఉంటాయి..


Also Read: పల్లె అందాలు, ఆలయాల విశిష్టత, భగవంతుడి గొప్పతనం వివరించే పాశురాలు.. అవే తిరుప్పావై!
 
భవానీదీక్షల విరమణ సమాచారంతో పాటూ , 24 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.  


బుకింగ్ హిస్టరీ , పూజా విధానం, సమాచారం , హోల్డింగ్ పాయింట్స్ ,గిరి ప్రదక్షిణ , దర్శన సమయాలు, రవాణా,  ప్రసాదం కౌంటర్, ప్రధమ చికిత్సా కేంద్రాలు, కల్యాణ కట్ట, మరుగుదొడ్లు, చెప్పుల స్టాండ్, అత్యవసర సేవలు, అన్నదానం, ప్రత్యేక కార్యక్రమాలు , పార్కింగ్, స్నానఘాట్లు, దివ్యాంగుల సౌకర్యాలు, ఫిర్యాదులు, సహాయం , లోకేషన్, సమాచారం కేంద్రం, సలహాలు, లైవ్ ఛానల్ , పోలీస్ స్టేషన్లు , ప్రచార కేంద్రం


ఐకాన్ పై క్లిక్ చేస్తే రూట్ మ్యాప్ ప్రత్యక్షం


మీకు ఎలాంటి సేవ కావాలి..అక్కడికి ఎలా వెళ్లాలి అనేది రూట్ మ్యాప్ ను అనుసరించండి. అన్నదానం, ప్రసాదం, దర్శనం ఇలా యాప్ లో ఉండే ఏ ఐకాన్ పై క్లిక్ చేస్తే అక్కడికి వెళ్లేందుకు రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఎలాంటి గందరగోళం లేకుండా ఈజీగా వెళ్లిపోవచ్చు. కల్యాణ కట్ట, తాగునీరు పాయింట్ల గురించ ఎవరినీ సమాచారం అడగకుండానే వెళ్లిపోవచ్చు. పైగా యాప్ లో రిజిస్టర్ చేసుకుంటే ఏ రోజు ఏ సమయానికి ఎంత మంది భక్తులు వస్తున్నారో తెలుస్తుంది. మరోవైపు పోలీసులకు కూడా భద్రతా ఏర్పాట్లు చేసుకునే వీలుంటుంది. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్లాన్ చేసుకోవచ్చు. అమ్మవారి దర్శనంకోసం వచ్చే భక్తులు సంతోషంగా తిరిగి వెళ్లేందుకు దేవస్థానం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.


ఇంకా...కనకదుర్గ నగర్‌లో 3 హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఇరుముడి బియ్యానికి ప్రత్యేక కౌంటర్లు తెరిచారు. భవానీ భక్తుల కోసం కనకదుర్గ నగర్‌లో షెడ్లు ఏర్పాటు చేశారు.  దుర్గాఘాట్‌, పద్మావతి ఘాట్‌, సీతమ్మవారి పాదాలు దగ్గర ప్రత్యేక షవర్లు ...భద్రత కోసం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 


Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!