Dhanurmasam Special Thiruppavi pasuram 4 ,5 and 6 :  ధనుర్మాసం నెలరోజులు ఆలయాల్లో పాశురాలు ఆలపిస్తారు.. గోదాదేవి రాసిన ఈ 30 పాశురాలు తిరుప్పావై అని పిలుస్తారు. మునుపటి కథనంలో 1,2,3 పాశురాలు వాటి భావం గురించి వివరణాత్మకంగా అందించాం. ఈ కథనంలో 4,5,6 పాశురాలు - వాటి భావం తెలుసుకుందాం..
 
పాశురం 4 ( డిసెంబర్ 19న పఠించాల్సినది)


ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్
ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు
పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు
తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్
వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్
మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.


భావం: ఓ పర్జన్య దైవమా..వర్షం కురిపించుటలో లోభత్వం చూపించవద్దు. సముద్రములో  నీటిని మొత్తం కడుపు నిండుగ త్రాగి.. ఆపై పైకెగసి.. సృష్టి మొత్తానికి కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరం రంగులా మేఘాలకు రంగునద్దు. నీ చేతిలో ఉన్న సుదర్శన చక్రంలా మెరువు, పాంచజన్యంలా గంభీరంగా గర్జించు, సారంగం నుంచి వెలువడే బాణాలులా వర్షించు...మేమంతా ఆ వర్షధారల్లో స్నానమాచరిస్తాం. లోకం మొత్తం సుఖంగా ఉండేలా వానలు కురిపించు.  


Also Read: తిరుప్పావై మొదటి 3 రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం


పాశురం 5 ( డిసెంబర్ 20న పఠించాల్సినది)


మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్


భావం: అందర్నీ ఆశ్చర్యపరిచే గుణం, చేష్టలు ఉన్నవాడు శ్రీ కృష్ణుడు. ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించిన కన్నయ్య మధురకు మధురాధిపతి, గొల్లకుల మాణిక్య దీపం, యశోదకు దామోదారుడు. ధనుర్మాస వ్రతంలో భాగంగా  శ్రీకృష్ణుని చేరి.. వేరే ఇతర కోర్కెలు కోరకుండా పవిత్రమై మనసుతో స్వామికి పూజలు చేయండి. ఆయన గుణగణాల గురించి సంకీర్తన చేసి, ధ్యానిస్తే సంచిత పాపాలు, ఆగామి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. స్వామిని కీర్తిస్తే చాలు పాపాలన్నీ అగ్నిలో పడిన దూదిలా భస్మం అయిపోతాయి. 


Also Read: పల్లె అందాలు, ఆలయాల విశిష్టత, భగవంతుడి గొప్పతనం వివరించే పాశురాలు.. అవే తిరుప్పావై!


పాశురం 6 ( డిసెంబర్ 21న పఠించాల్సినది)


పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో
పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.


భావం: అందరికంటె ముందుగా మేల్కొనేవారు, ఇంకా నిద్రిస్తున్న గోపికలను ఉద్దేశించి తెల్లవారిందమ్మా ఇక లేచిరండి అని పిలుస్తున్నారు. వేకువమే మేల్కొన్న పక్షులు ఒకటి నొకటి పిలుచుకుంటూ మేతకు వెళ్లినట్టే..గరుత్మంతుడి రాజైన ఆ శ్రీమన్నాయణుడి కోవెలలో శంఖధ్వని వినిపించలేదా లేచి రండి అని పిలుస్తున్నారు. ఇదిగో పూతనస్తనముల నుంచి విషాన్ని ఆరగించినవాడు, తనను చంపేందుకు వచ్చిన శకటాసురుని సంహరించినవాడు, పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించువాడు అయిన ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, బుషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు. ఆయన సేవకోసం మేమంతా మేల్కొన్నాం..నీవు మాత్రం ఇంకా నిద్రపోతున్నావేమమ్మా..రండి రండి..మాతో కలసి వ్రతం చేయండి అని నిద్రిస్తున్నవారిని మేల్కొలిపింది గోదాదేవి.


Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!