Shani Pradosh Vratam 2025: ధార్మిక పరంపరలో ప్రదోష వ్రతం విశేషమైనది. శనివారం రోజు వస్తే ఇది ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. 2025 అక్టోబరు 4 శనివారం ప్రదోషవ్రతం వచ్చింది. ఈ రోజు వ్రతం సాధన ఉపాసన కాదు.. కానీ శాస్త్రాలు ఇది ఒక కర్మ-రీసెట్ అవకాశం అని చెప్తున్నాయి.
ప్రదోష వ్రతం - శని సంగమం
ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయం సమయం.. అందులో ఈ వ్రతాన్ని సంధ్యాసయమంలో ఆచరిస్తారు. ఈ సమయంలో చేసే శివ పూజా జీవితంలో కఠినమైన కర్మఫలం కూడా బలహీనం చేస్తుంది. శనివారం రోజు ప్రదోష వ్రతం విశేషమైనది
పౌరాణిక కథ - రహస్యం
స్కంద పురాణంలో ఉన్న కథ ప్రకారం.. రాజా చంద్రభాగ్ నుశత్రువులు చుట్టుమడతారు. ఆ సమయంలో ప్రదోష వ్రతం చేసి శివుడు, శనిని ఆరాధన చేస్తాడు. తద్వారా పరాజయం నిశ్చయం అయిన సమయంలో విజయం సాధిస్తాడు.
మహాభారతంలో కూడా భీమసేనుడు యుద్ధం ముందు ప్రదోష కాలం లో పూజ ఆచరించి కఠినమైన పరిస్థితిలో కూడా అపరాజేయమైన బలాన్ని అర్జించాడు.
అంటే..ప్రదోష వ్రతం కేవలం ఆశయం కాదు, అసాధ్యమైనది సాధించడానికి ఒక సాధనం
యువకులకు ఎందుకు విశేషం?
ఈ తరం యువకులు కెరీర్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రేమ సంబంధాలు సఫలంకాక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తుంది శని ప్రదోష వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో ఉండే అనిశ్చితి తొలగిపోతుంది. వ్రత విధిసాయంకాలం సూర్యాస్తమయానికి గంట ముందు స్నానం చేసి, స్వచ్ఛమైన వస్త్రాలు ధరించండి.
పరమేశ్వరుడికి పూజచేయండి.. శివపూజ పూర్తిచేసిన తర్వాత .. ఓం శం శనైశ్చరాయ నమః అని 108 సార్లు జపించండి.
ఈ రోజంతా మౌనంగా ఉండండి.. శాస్త్రాల్లో ఏముందంటే..
ఈ వ్రతంతో రుణం నుంచి విముక్తి పొందుతారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి..పూర్తవుతాయి. అందులో విశేషమైన విషయం ఏంటంటే..ఈ వ్రతాన్ని ఆచరించేవారికి శక్తి , సమతుల్యత ప్రసాదిస్తుంది, ఇది జీవితం లో ఉన్న సంఘర్షణలను దృఢంగా ఎదుర్కొనేలా చేస్తుంది.
శని మంత్రం
నీలాఞ్జనసమాభాసం రవిపుత్రం యమగ్రజమ్ ।ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరమ్॥
అక్టోబర్ 4 రోజు ఈ శని ప్రదోష వ్రతం ఒక సాధారణ తిథి కాదు. ఇది ఒక అద్భుతమైన అవకాశం, అందులో వ్యక్తి తన జీవితయాత్రను కొత్తగా మొదలు పెట్టవచ్చు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు ఆధారంగా అందించిన కథనం ఇది. ఏదైనా సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి
పాలవాడు, వంటవాడు, సోదరుడు, డ్రైవర్ తో శత్రుత్వం ప్రమాదకరం! రావణుడు చెప్పిన రహస్యాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మీ జాతకంలో శని దోషం ఉందా లేదా! ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి, నివారణ చర్యలు ఇవే!. ఈ లింక్ క్లిక్ చేయండి
మహాభారతం ప్రకారం విజయం, సంతోషం కోసం నిత్యం ఈ నాలుగు పాటించాలి తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి