కుండలిలో శని గ్రహం అశుభ స్థితిలో ఉంటే శని దోషం కలుగుతుంది. ఇది వ్యక్తికి ధననష్టాన్ని, ఆరోగ్య సంబంధిత సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు, బాంధవ్యాలలో కలహం కలిగిస్తుంది. శని దోషం ఉందని ఎలా తెలుస్తుంది? శని దోషం ఉందో లేదో తెలుసుకునేందుకు జ్యోతిష్యుడిని సంప్రదించాలి. మీరు జన్మించిన తేదీ, సమయం ఆధారంగా గ్రహాల స్థానాన్ని అంచనా వేస్తారు. శని ఏ స్థానంలో ఉంది? అష్టమంలో(8వస్థానంలో) ఉందా...లేదంటే శుభాన్నిచ్చే గ్రహాలతో కలసి ఉందో తెలుసుకోవాలి. జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లకుండా తెలుసుకునే అవకాశమూ ఉంది..
శనిదోషం ఉంటే సాధారణ లక్షణాలేంటంటే.. చేసే పనిలో పదే పదే అడ్డంకులు, మానసిక బాధ, అనారోగ్యం, కష్టపడినా చేతిలో డబ్బు నిలవకపోవడం, జుట్టు ఊడిపోవడం లాంటి లక్షణాలుంటాయి కుండలిలో శనిదోషం ఉంటే...సంపాదించినా డబ్బు నిలవదు, డబ్బు వెచ్చించినా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తికావు
ఎన్ని ఉన్నా మానసికంగా సంతోషం ఉండదు.. శారీరక అలసట తప్పదు..ఎప్పుడూ ఏదో అనారోగ్యం ఉన్నట్టుంటుంది
వ్యక్తిగత జీవితంలో అనుకోని వివాదాలు చుట్టుముడతాయి..కుటుంబంలో మీరు
యవ్వనంలో ఉండగానే కంటి చూపు మందగిస్తుంది..జుట్టు రాలిపోతుంది..చెవికి సంబంధించిన సమస్యలొస్తాయి వైవాహిక జీవితం తప్పని పరిస్థితుల్లో అన్నట్టు సాగుతుంది..ప్రేమ, అనుబంధం, ఆప్యాయత ఉండదు..పైగా అనుకోని గొడవలు జరుగుతూనే ఉంటాయి
కుండలిలో శని గ్రహం అశుభ స్థితిలో ఉంటే శని దోషం కలుగుతుంది. ఇది వ్యక్తికి ధననష్టాన్ని, ఆరోగ్య సంబంధిత సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు, బాంధవ్యాలలో కలహం కలిగిస్తుంది. ఈ దోషం ప్రభావాన్ని తగ్గించడానికి, శని దేవుని పూజ చేయడం, హనుమాన్ చాలీసా చదవడం, నీలం రత్నం ధరించడం లాంటివి పాటిస్తుంటారు. శని దోషం ఉందని ఎలా తెలుస్తుంది? శని దోషం ఉందో లేదో తెలుసుకునేందుకు జ్యోతిష్యుడిని సంప్రదించాలి. మీరు జన్మించిన తేదీ, సమయం ఆధారంగా గ్రహాల స్థానాన్ని అంచనా వేస్తారు. శని ఏ స్థానంలో ఉంది? అష్టమంలో(8వస్థానంలో) ఉందా...లేదంటే శుభాన్నిచ్చే గ్రహాలతో కలసి ఉందో తెలుసుకోవాలి. జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లకుండా తెలుసుకునే అవకాశమూ ఉంది..
శనిదోషం ఉంటే సాధారణ లక్షణాలేంటంటే.. చేసే పనిలో పదే పదే అడ్డంకులు, మానసిక బాధ, అనారోగ్యం, కష్టపడినా చేతిలో డబ్బు నిలవకపోవడం, జుట్టు ఊడిపోవడం లాంటి లక్షణాలుంటాయి కుండలిలో శనిదోషం ఉంటే...సంపాదించినా డబ్బు నిలవదు, డబ్బు వెచ్చించినా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తికావు
ఎన్ని ఉన్నా మానసికంగా సంతోషం ఉండదు.. శారీరక అలసట తప్పదు..ఎప్పుడూ ఏదో అనారోగ్యం ఉన్నట్టుంటుంది
వ్యక్తిగత జీవితంలో అనుకోని వివాదాలు చుట్టుముడతాయి..కుటుంబంలో మీరు
యవ్వనంలో ఉండగానే కంటి చూపు మందగిస్తుంది..జుట్టు రాలిపోతుంది..చెవికి సంబంధించిన సమస్యలొస్తాయి వైవాహిక జీవితం తప్పని పరిస్థితుల్లో అన్నట్టు సాగుతుంది..ప్రేమ, అనుబంధం, ఆప్యాయత ఉండదు..పైగా అనుకోని గొడవలు జరుగుతూనే ఉంటాయి
శనిదోషం నుంచి విముక్తి పొందేందుకు పరిహారాలు
జాతకంలో శనిదోషాన్ని తగ్గించుకునే పరిహారాలు కొన్ని సూచించారు జ్యోతిష్య శాస్త్రం పండితులు
ప్రతి శనివారం శని దేవుని ఆలయానికి వెళ్లి..నలుపు లేదా నీలం రంగు వస్తువులు సమర్పించండి శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి.. శని మంత్రం జపించడం శుభప్రదం
శని మంత్రం: "ఓం శం శనైశ్చరాయ నమః" - ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా శని గ్రహానికి సంబంధించిన 23,000 సార్లు జపించవచ్చు.
శనిదోషం తగ్గించడానికి హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం ఎంతో ప్రయోజనకరం
ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో సిందూరం, నీలం రంగు పుష్పాలు సమర్పించండి.
శనివారం నాడు నల్లని వస్త్రాలు, నల్లని నువ్వులు, నల్లని కందులు (ఉలవలు), లోహ వస్తువులు లేదా నీలం రాయిని దానం చేయడం మంచిది.
పేదలకు అన్నదానం చేయండి, నీలం లేదా నలుపు వస్త్రాలు అందించండి
జ్యోతిష్య శాస్త్ర పండితుల సలహా మేరకు శనియృ యంత్రాన్ని ఆరాధించండి ప్రతి శనివారం ఉపవాసం ఆచరించి..శని భగవానుడిని స్మరించండి..శని త్రయోదశి, అమావాస్య మరింత పవర్ ఫుల్ వృద్ధులకు, రోగులకు సేవ చేయడం శని దేవుని అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడుతుంది
కాకులకు, చీమలకు ఆహారం అందించడం శనిదోషాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు.
శని స్తోత్రాన్ని, శని కవచాన్ని పఠించండి
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి భగవంతుడిని ఆరాధించేవారిపై, కష్టపడేవారిపై శని ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతారు పండితులు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు ఆధారంగా అందించిన కథనం ఇది. ఏదైనా సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి
పాలవాడు, వంటవాడు, సోదరుడు, డ్రైవర్ తో శత్రుత్వం ప్రమాదకరం! రావణుడు చెప్పిన రహస్యాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి